తెలంగాణ

కలకలం రేపిన మావోయిస్టుల లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, ఫిబ్రవరి 12: సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలంలోని రామాపురం గ్రామసర్పంచ్‌కు సోమవారం రాత్రి రాష్ట్ర మావోయిస్టు పార్టీ పేరుతో వచ్చిన బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. ఈవిషయమై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. ఏఎస్సై జయకర్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి 7గంటల సమయంలో హెల్మెట్ ధరించి ఉన్న ఓ ఆగంతకుడు సర్పంచ్ లేని సమయంలో సర్పంచ్ ఇంటికి వచ్చి అతని భార్యకు ఓ కవర్ అందించి వెళ్లాడు. ఇంటికి వచ్చిన సర్పంచ్ లేఖను చదవగా రూ.2 లక్షలతో పాటు ఐదుగురు వ్యక్తులకు భోజనాలు తాము చెప్పిన చోట పెట్టి వెళ్లాలని, పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని లేఖలో హెచ్చరించారు. దీంతో సర్పంచ్ మేళ్లచెర్వు పోలీసులకు ఫిర్యాదు చేయగా స్పెషల్ ఇనె్వస్టిగేషన్ పోలీసులతో క్షేత్రస్థాయిలో బుధవారం విచారణ చేపట్టారు. గ్రామంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ఫుటేజిలో ఆగంతకుడి దృశ్యాలు రికార్డు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సర్పంచ్‌కు అందిన లేఖపై నిజంగా మావోయిస్టు పార్టీ రాసిందా.. లేదా ఎవరైనా డబ్బుల కోసం ఇలాంటి బెదిరింపు చేశారా అనే కోణంలో సైతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.