తెలంగాణ

రాష్ట్రమంతా గోదారమ్మ పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 13: తెలంగాణ రాష్ట్రమంతా గోదారమ్మ పరవళ్లు తొక్కాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇంజనీర్లతో అన్నారు. గురువారం ఆయన కాళేశ్వరం, లక్ష్మీ బ్యారేజీ మేడిగడ్డలను సందర్శించారు. ముందుగా కాళేశ్వరం ఆలయం వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొమ్మెర వెంకటేశం, ఈవో మారుతి ఆలయ మర్యాదలతో ముఖ్యమంత్రిని పట్టు వస్త్రాలతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించిన అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజీ బ్యాక్ వాటర్ కాళేశ్వర స్వామి వారి పాదాల వద్దకు చేరడం పట్ల సీఎం కేసీఆర్ నిండుకుండలా ఉన్న గోదావరిని చూసి పులకించిపోయారు. భారీ అంచనాలకు వెరవకుండా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ బీడు భూములకు శాశ్వత పరిష్కారం లభించినట్టయిందని ఆయన
అధికారులతో అన్నారు. మేడిగడ్డ బ్యాక్ వాటర్ నిండుకుండలా ఉన్న
గోదావరి నిల్వ నీటిని చూసి సంతోషం వ్యక్తం చేసిన ఆయన వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరిలో నాణేలు వదిలారు. ఏరియల్ సర్వే ద్వారా కూడా గోదావరి నిల్వ నీటిని చూసి పరవశించి పోయారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నీటి నిల్వలు తరలింపు విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి సలహాలు, సూచనలు చేశారు. ముఖ్యంగా గోదావరి జలాలతో తెలంగాణ మొత్తం సస్యశ్యామలం కావాలని బ్యారేజీలలో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తోడుకోవాలని తద్వారా కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు జల కళతో కనువిందు చేయాలన్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నిర్మించిన అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరంతో రైతాంగం సుభిక్షంగా ఉండాలన్నారు. అందుకు అవసరమైతే ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా సంబంధిత అధికారులకు వాకీటాకీల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేరేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఒక్క నీటి చుక్క కూడా వృథా కావద్దని గోదావరి నీరు తెలంగాణ ప్రాంతంలో పారాలన్నారు. అదే విధంగా గోదావరి జలాలు వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లదేనన్నారు. గోదావరిలో సరిపడా నీరుందని, తరలింపు ప్రక్రియపై పక్కా ప్రణాళిక అధికారులకు ఉండాలని, చుక్క నీరు వృథా కాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. ఆయన వెంట మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి, వరంగల్ రూరల్ జిల్లా జడ్పీఛైర్మన్లు శ్రీహర్షిణి, పుట్ట మధుకర్, గండ్ర జ్యోతి ఉన్నారు. ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, నీటి పారుదల ముఖ్య సలహాదారు మురళీధర్‌రావు, ఓఎస్డీ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... మేడిగడ్డ రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌ను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్