తెలంగాణ

రిజర్వేషన్ల సాధనకు ఐక్య ఉద్యమాలు సాగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 13: రాజకీయ రిజర్వేషన్ల సాధనకు బీసీలంతా పార్టీలకు అతీతంగా ఐక్య ఉద్యమాలు సాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండలో తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర బీసీ సంఘాల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర భారతదేశంలో అగ్రకుల పాలకులు గొర్రెలు, బర్రెలు, వృత్తిరుణంలు ఇచ్చి బీసీలను రాజ్యాధికారానికి దూరం చేశారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 29 మంది ముఖ్యమంత్రులైతే అంతా అగ్రకులాల వారేనన్నారు. చివరకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల జారీలో కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒక్క రోజులో బిల్లు పెట్టి 10 శాతం రిజర్వేషన్లు అందించారని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని 30 ఏళ్లుగా పోరాడుతున్నా ఏ రాజకీయ పార్టీ ముందుకు రాలేదన్నారు. 52 శాతం జనాభా ఉన్న బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని, 29 రాష్టాల్లో 16 రాష్ట్రాల్లో ఒక్క బీసీ పార్లమెంట్ సభ్యుడు లేరని, 545 లోక్‌సభ స్థానాల్లో కేవలం 96మంది మాత్రమే ఉన్నారని, తెలంగాణలో 119 ఎమ్మెల్యేల్లో 22మంది మాత్రమే ఉన్నారని, ఏపీలో 175 మందిలో 33మంది ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో 22 జిల్లాల నుండి బీసీ ఎమ్మెల్యే లేరని, రాష్ట్రంలో 112 బీసీ కులాలు ఉండగా ఇప్పటిదాకా 104 కులాలు అసెంబ్లీ గడప తొక్కలేదన్నారు. కేవలం బీసీలు ఓట్లు వేసే వారిగానే మిగిలిపోతుండగా ధనస్వామ్యమైన భారత ఎన్నికల వ్యవస్థలో బీసీలకు రాజ్యాధికారం కష్టసాధ్యమైపోతుందని అందుకే రాజకీయ రిజర్వేషన్ల సాధనకు బీసీలు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. న్యాయవ్యవస్థలో సైతం సుప్రీంకోర్టు జడ్జీల్లో 33మంది ఉండగా వారంతా అగ్రకులాల వారేనని, దేశంలోని మొత్తం హైకోర్టుల జడ్జీలు 749 మందిలో 39 మంది బీసీలు, 18 మంది ఎస్సీలు, ఐదుగురు ఎస్టీలు మినహా మిగతా 687 మంది జడ్జీలు ఉన్నత కులాలవారేనన్నారు. అటు న్యాయవ్యవస్థలో 92 శాతం, రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థలో 80 శాతం పదవులను 15 శాతం జనాభా ఉన్న అగ్రకులాల వారే పొందుతున్నారన్నారు. 80 శాతం పదవుల్లో ఉన్న 15 శాతం మంది అగ్రకులాల వారు రాజ్యాధికారంలో అండగా రిజర్వేషన్లు, కాంట్రాక్టులు వారి వర్గాల వారికే ఇచ్చుకుంటూ వెళుతుండగా 54శాతం జనాభా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతోందని ఐనప్పటికీ ఒక్క పార్టీ కూడా నోరు మెదపడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో బీసీలు ఐక్య పోరాటాలతో రాజ్యధికార సాధనకు రాజకీయ రిజర్వేషన్లకు పోరాటాలు సాగించాలని ఇందుకు బీసీ సంఘాల నాయకులు గ్రామాల వారిగా బీసీ వర్గాల్లో చైతన్యం రగిలించి వారిని ఉద్యమ పథకంలో నడిపించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, వివిధ జిల్లాల బీసీ సంక్షేమ సంఘాల నాయకులు దుడుకు లక్ష్మినారాయణ, ప్రసన్నకుమార్, సింగం లక్ష్మినారాయణ, ఐతగోని జనార్ధన్‌గౌడ్, తిరుమలగిరి అశోక్, కాశీరాములు యాదవ్, సిరిప్రోలు వెంకటపతి, దుడ్డు కృష్ణమూర్తి, సత్యనారాయణ ముదిరాజ్, పుట్ట కోటి, గుండు వెంకటేశ్వర్లు, కూరెళ్ల విజయ్‌కుమార్, చిలుకరాజు సతీష్‌కుమార్, కర్నాటి యాదగిరి పాల్గొన్నారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణయ్య