తెలంగాణ

కేసీఆర్ ‘మహానాయకుడు’ పుస్తకం ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ప్రముఖ వక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, రచయిత విజయర్కే రాసిన ‘కేసీఆర్ మహానాయకుడు’ పుస్తకాన్ని రవీంద్రభారతిలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్‌తో కలిసి ఆవిష్కరించారు. శనివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మహానాయకుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ జీవిత చరిత్ర, ప్రత్యేకతలు, రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన సీఎంపై ప్రత్యేక పస్తకం తీసుకువచ్చిన రచయిత వేణుగోపాల్‌రెడ్డిని అభినందించారు. సీఎం జన్మదినం సందర్భంగా క్రీడా శాఖ ఆధ్యవర్యంలో క్రీడాకారులతో కలిసి హరితహారంను నిర్వహిస్తున్నామన్నారు.
*చిత్రం...కేసీఆర్ మహానాయకుడు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్