తెలంగాణ

కేంద్ర సహకారం లేకుంటే మెట్రో అయ్యేది కాదు: లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మెట్రో రైలు ప్రారంభోత్సవం టీఆర్‌ఎస్ సొంత వ్యవహారంలా చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శించారు. మెట్రో రైలు పార్కింగ్, ఫుట్‌పాత్‌లకు స్థలాలు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. శనివారం నాడు కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి వెంట లక్ష్మణ్ జేబీఎస్ నుండి సీబీఎస్ వరకూ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే మెట్రో రైలు పనులు పూర్తయ్యేవే కాదని అన్నారు. టీఆర్‌ఎస్ వైఫల్యం వల్లనే యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ రావడం లేదని చెప్పారు. మజ్లిస్ వత్తిడితోనే పాతబస్తీకి మెట్రోను తీసుకువెళ్లడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు. ఈసీఐఎస్, కొంపల్లి, అల్వాల్‌కు మెట్రోను విస్తరించాలని లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ నేతలు అంతా ఘనంగా సేవాలల్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ పాటించాం: తలసాని
జేబీఎస్ నుండి సీబీఎస్ వరకూ మెట్రో రైలు మార్గం ప్రారంభం సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన ఆరోపణలను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు.
కేంద్ర మంత్రిగా ఆయనకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ మేరకు మెట్రో ప్రారంభోత్సవ శిలాఫలకంపై పేరును పెట్టామని చెప్పారు. మెట్రో అధికారులు కిషన్‌రెడ్డి కార్యాలయానికి వెళ్లి సమాచారం ఇవ్వడంతో పాటు తాను కూడా స్వయంగా ఆహ్వానించానని అన్నారు. మెట్రో ఉన్నతాధికారులు ఏడో తేదీ తర్వాత దాదాపు 25 రోజుల పాటు అంతర్జాతీయ పర్యటన ఖరారైనందున మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏడోతేదీన నిర్వహించడం జరిగిందని ఆయన వివరించారు. మెట్రో ప్రారంభోత్సవంపై రాష్ట్ర ప్రభుత్వానికి తొందరేం లేదని, పూర్తయిన ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. మొదటిసారి మెట్రో సేవలను ప్రధాని ప్రారంభించారని, రెండోసారి ఎన్నికల కోడ్ అడ్డువచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రానికి రావల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
*చిత్రం...సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్