తెలంగాణ

19వ తేదీన భూసార హెల్త్ డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఈ నెల 19వ తేదీన రాష్ట్రంలో భూసార ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ వ్యవసాయశాఖాధికారులను, రైతులను కోరింది. రైతులందరి కమతాల వారీగా మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 2015-17 భూసార హెల్త్ కార్డు పథకం కింద 10.34 లక్షల మట్టి నమూనాలను సేకరించి వాటిని పరీక్షించి 55.44 లక్షల హెల్త్‌కార్డులను ముద్రించి రైతులకు పంపిణీ చేశారు. 2017-19లో 9.60 లక్షల మట్టి నమూనాలను సేకరించి వాటిని పరీక్షించి 43.18లక్షల సాయిల్ హెల్త్ కార్డులను ముద్రించి రైతులకు పంపిణీ చేశఓరు. రాష్ట్రంలో మట్టి నమూనా పరీక్షల కొరకు వ్యాన్లను అందుబాటులో ఉంచారు. రైతులు ప్రస్తుతం అశాస్ర్తియ పద్ధతిలో మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నట్లు నివేదికలు తెలియచేశాయి. సమతుల ఎరువులవాడకం వల్ల ఆరోగ్యాన్ని కాపాడడం కాకుండా పెట్టుబడులు ఆదా చేయడం జరుగుతోందన్నారు. ఈ క్రమంలో మట్టి నమూనా ఎంతో ప్రాధాన్యత ఉంది. కేవీకే ఆధ్వర్యంలో అధికారులు, శాస్తవ్రేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో వారి పరిధిలో ఉన్న మోడల్ గ్రామాలను సందర్శించి భూసార హెల్త్ కార్డు డేను నిర్వహించాలని, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.