తెలంగాణ

నేడు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 66వ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం రాష్టవ్య్రాప్తంగా భారీ ఎత్తున వేడుకలు నిర్వహించడానికి మంత్రులు, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ జన్మదినం కానుకగా ఆయనకు అమితంగా ఇష్టమైన మొక్కలు నాటాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గ్రీన్ ఇండి యా చాలెంజ్ ఉద్యమ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్
ఇండియా చాలెంజ్ సంస్థ ప్రతినిధులు సీఎం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రోజులుగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఎంపీ సంతోష్‌కుమార్ సోమవారం హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడే మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత జలవిహార్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ను పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. సీఎం కేసీఆర్ బర్త్‌డే కేక్‌ను ఎంపీ కే కేశవరావుకట్ చేస్తారు. అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉచిత హెల్త్ క్యాంప్‌ను ప్రారంభిస్తారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మొక్కలు నాటుతారు. కేసీఆర్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ ప్రారంభిస్తారు. ప్రభుత్వ పథకాల ఎల్‌ఇడి ప్రదర్శనను హోం మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరిస్తారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ దివ్యాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్టీ నేతలు, హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఊరు, వాడ, పల్లె, పట్నం, గల్లీ అన్నిచోట్లా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సీఎం పీఆర్వోలు రమేశ్ హజారీ, సైదిరెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు సీఎం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రూపొందించిన దృశ్య, శ్రావణ గీతాలను ఆదివారం విడుదల చేశారు. కాగా, మాదాపూర్‌లోని ఆర్ట్స్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను ఆదివారం మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ బాల్యం, విద్యాభాస్యం, రాజకీయ ప్రస్థానం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ దిశగా తీసుకున్న అనేక కార్యక్రమాలపై చిత్రకారులు గీసిన చిత్రాలను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ఇలాఉండగా సీఎం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, నీటి పారుదల ప్రాజెక్టులు, పార్క్‌లు, రహదారులు, రోడ్ల కూడళ్లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. జిల్లాల్లో ఎక్కడికక్కడ మంత్రులు, కలెక్టర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

*చిత్రం... సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటుతున్న టీసీఎస్ వైస్ చైర్మన్ రాజన్న