తెలంగాణ

ధర్నా చౌక్ వద్ద నేడు కాంగ్రెస్ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఎస్సీ, ఎస్టీ హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం సోమవారం భారీ ఎత్తున ధర్నా చౌక్‌లో భారీ ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో పాటు ప్రజలు పాల్గొనాలని ఆయన కోరా రు. ధర్నా మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, గిరిజనులు, మైనారిటీల పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నాయన్నారు. మతతత్వశక్తుల ఆధిపత్యం పెరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ అని, తమ పార్టీ నిర్వహించే ధర్నాలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆర్థిక అనిశ్చిత స్థితి నెలకొందన్నారు. ఆర్థిక మాంద్యం పెరిగిందని, ఉద్యోగాలు దొరకడం లేదని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అశాంతి నెలకొనడంతో పట్టణాలకు భారీగా వలసలు పెరిగాయన్నారు. ఉపా ధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా, ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు.