తెలంగాణ

లక్ష్మీ బ్యారేజీ వద్ద మహారాష్ట్ర ఎమ్మెల్యే ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, ఫిబ్రవరి 17: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీబ్యారేజీ (మేడిగడ్డ) వద్ద మహారాష్ట్ర అహెరి నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మారావు బాబా సోమవారం ఆందోళనకు దిగారు. లక్ష్మీ బ్యారేజీ వద్ద ధర్మారావు బాబా నేతృత్వంలో వంద మంది రైతులతో ఆయన ఆందోళనకు దిగారు. బ్యారేజీ ముంపునకు గురైన మహారాష్టల్రోని సిరొంచ తాలూకాలోని హరుడ, పోచంపల్లి పలు గ్రామాల రైతుల పంట భూములు లక్ష్మీబ్యారేజీ బ్యాక్ వాటర్ వలన నీట మునిగిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన దుమ్మెత్తి పోశారు. బ్యారేజీ నిర్మాణానికి ముందస్తుగా తమ రైతులను భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర రైతులను నట్టేట ముంచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఎకరాకు 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత నివేదిక అందజేసి తమ ప్రాంత రైతులకు న్యాయం చేకూర్చేలా తాను వెన్నంటి ఉంటానని రైతులకు భరోసానిచ్చారు. తొలుత పంట పొలాలు, నీట మునిగిన ప్రాంతాలను ఎమ్మెల్యే ధర్మారావుబాబా సందర్శించారు. బ్యారేజీ వద్దకు చేరుకోగానే పోచంపల్లి రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. బ్యారేజీ ముంపునకు గురైన పంట భూములకు నష్టపరిహారంతో పాటు సమీప గ్రామాలకు పునరావాసం కల్పించేంత వరకు తెలంగాణ ప్రభుత్వంపై నిరంతర పోరాటం చేస్తానని ఆయన ఉద్ఘాటించారు. పోచంపల్లి రైతులకు లక్ష్మీబ్యారేజీ కంపెనీ యాజమాన్యం గ్రామ అభివృద్ధి కోసం తాము కృషి చేస్తామన్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని సర్పంచ్ చల్లా లలిత ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను అవసరం కోసమే వాడుకున్నారే తప్ప తమను మాత్రం విస్మరించడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్టక్రు చెందిన పలు గ్రామాల రైతులతో పాటు ఎన్‌సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ బ్యారేజీ వద్ద ఆందోళనకు దిగనున్న మహారాష్ట్ర అహెరి ఎమ్మెల్యే ధర్మారావుబాబా ఆందోళనకు దిగుతున్నారన్న సమాచారంతో మహదేవ్‌పూర్ ఎస్సై బెల్లం సత్యనారాయణ, పలిమెల ఎస్సై శ్యాంరాజుతో పాటు 20 మంది సివిల్, సీఆర్‌పీఎఫ్ బలగాలు, మహారాష్టల్రోని స్పెషల్ పార్టీ పోలీసులు వంద మంది బ్యారేజీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.