తెలంగాణ

పౌరసత్వ బిల్లు రద్దుకు ఐక్య ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరచింత, ఫిబ్రవరి 17: ఆనాడు దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్‌వారితో జరిపిన పోరాటంలో ఎక్కడా జాడ లేని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మత సంస్థలు హిందు సిద్ధాంతం పేరుతో నేడు దేశాన్ని పాలిస్తూ ముస్లింలను ఇబ్బందులకు గురి చేసే ఎన్‌ఆర్‌సీ, సీఏఏ చట్టాలను తీసుకువచ్చి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. పౌరసత్వ బిల్లు రద్దుకు దేశంలోని వామపక్ష పార్టీలన్నీ ఏకమై ఐక్య ఉద్యమాలు చేద్దామని అందుకు సీపీఎం సిద్ధం ఉందని ఆయన ప్రకటించారు. ఆదివారం రాత్రి మండల కేంద్రంలో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవ బహిరంగ సభకు పట్టణ కార్యదర్శి బి వెంకటేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన బీవీ రాఘవులు మాట్లాడుతూ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్న ఆర్‌ఎస్‌ఎస్ యోచనకు బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ పౌరసత్వ బిల్లును ప్రవేశ పెట్టిందని ఆ చట్టం అమలుతో దేశంలో నివసిస్తున్న ముస్లింలు నాలుగుతరాల వారసత్వం ఉంటేనే ఇక్కడివారిగా పరిగణిస్తూ, లేని వారిని దేశద్రోహుల కింద జమ కడుతూ జైళ్లలో పెట్టేందుకు గోదాంలను సిద్ధం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూముస్లింల మధ్య గొడవలు తెచ్చేలా ఉన్న పౌరసత్వ బిల్లును ఇప్పటికే 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తూ తీర్మానలను పంపినా మోదీ ప్రభుత్వం బలవంతంగా అమలు చేయాలని చూస్తోందని బీవీ రాఘవులు ఆరోపించారు, ముస్లింలకు ఇబ్బందులు కలిగించే పౌరసత్వ బిల్లు పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఉద్యమానికి సిద్ధంగా ఉంటే తన నాయకత్వంలో వామపక్షపార్టీలన్నీ ఐక్య ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ బహిరంగ సభలో ప్రజావాగ్గేయకారుడు గోరేటి వెంకన్న మాటల రూపంలో పాటలు పాడి అందరినీ అకట్టుకున్నారు.