తెలంగాణ

తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఫిబ్రవరి 17: దశాబ్దాలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ శ్రీరామరక్షలా ఉండి అభివృద్ధి చేయడంతో పాటు అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి అహర్నిశలూ కృషిచేస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ 66వ జన్మదినోత్సవ వేడుకలను సోమవారం జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో తొలుత భారీ కేక్‌కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలోని హైవే నుండి మూసీ ప్రాజెక్టు వరకు వెళ్లే రహదారికి కేసీఆర్ రోడ్డుగా నామకరణం చేసి ఏకకాలంలో 12 కిలోమీటర్ల దూరంలో 6600 మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేది కాదన్నారు. స్వరాష్ట్రం కోసం దశాబ్దాలుగా అనేక ఉద్యమాలు చేసిన సమైక్యపాలకులు కుట్రలు చేసి అడ్డుకున్నారన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించి ఉన్నత పదవులు త్యాగించి తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమపార్టీగా టీఆర్‌ఎస్‌ను స్థాపించి అనేక అవమానాలు, విమర్శలు, ఒడిదుడుకులు ఎదురైనా మనోధైర్యంతో తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి కేంద్రమే దిగి వచ్చి రాష్ట్రాన్ని ఇచ్చేలా చేసిన ఉద్యమయోధుడు కేసీఆర్ అని కీర్తించారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌తోనే కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో ప్రజలు అధికారం ఇవ్వగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన రాష్ట్ర భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తూ తెలంగాణను నేడు దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన మహానాయకుడుని ప్రశంసించారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ రాష్ట్రం సాకారం దిశగా ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్భ్రావృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై సహకరించాలని పిలుపునిచ్చారు. సీఎం జన్మదినం సందర్భంగా ఆయనకు ఇష్టమైన మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారన్నారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకొని సమాజానికి సేవచేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గుజ్జ దీపిక, కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిశోర్‌కుమార్, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, పీఎసీఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సూర్యాపేటలో నిర్వహించినరక్తదాన శిబిరంలో పాల్గొన్న విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి