తెలంగాణ

వేడుకగా సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, ప్రధాన మంత్రి మొదలుకొని లోక్‌సభ స్పీకర్, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఫోన్ల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ 66వ సంవత్సరాలు పూర్తి చేసుకొని సోమవారం 67వ ఏటాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా తెలంగాణ గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలియజేశారు. సుఖ సంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితం గడపాలని వారు ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఇతర ప్రముఖుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దతాత్రతేయ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, పంజాబ్ గవర్నర్ విపి సింగ్ బడ్నోర్, చత్తీస్‌గడ్ గవర్నర్ అనుసూయ ఉయికె ఉన్నారు. ఇక రాష్ట్రానికి చెందిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ రాజా సదారామ్, కమిషనర్ బుద్దా మురళి, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరిశంకర్, శాసనమండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో తెలంగాణ నాన్ గజిటెడ్ అధికారుల సంఘం నాయకులు కారం రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్, రేచల్ తదితరులు సీఎం కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
జిల్లాల్లో మొక్కలు నాటిన మంత్రులు
సీఎం కేసీఆన్ జన్మదిన వేడుకలు రాష్టవ్య్రాప్తంగా భారీ ఎత్తున జరిగాయి. ఈ సందర్భంగా మంత్రులు తమ జిల్లాల్లో మొక్కలు నాటడంతో పాటు రక్తదాన శిబిరాలు, దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్ల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు, ఆనాధలకు బట్టలు, పండ్లు, వస్తువుల పంపిణీ వంటి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ప్రగతిభవన్‌లో సీఎం సతీమణి శోభా, కుమార్తె కవితతో కలిసి మంత్రి కేటీఆర్, భార్య శైలిమాతో కలిసి మొక్కలు నాటారు. ఆ తర్వాత షామీర్‌పేటలో జీనోమ్ వ్యాలీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు. కాగా హైదరాబాద్ జలవిహార్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ జన్మదిన భారీ కేక్‌కు ఎంపీలు కే కేశవరావు కట్ చేయగా స్పీకర్, మండలి చైర్మన్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే పలు కళారూపాల ప్రదర్శనతో పాటు సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు వినూత్న పథకాలపై ఎల్‌ఇడీ ప్రదర్శనను మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమ నాయకుడు, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ జలవిహార్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి సంతోష్‌కుమార్ బల్కంపేట ఎల్లమ్మగుడిలో సీఎం కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా హైదరాబాద్ సంజీవయ్య పార్క్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మతో పాటు వివిధ శాఖాధిపతులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు, కార్యదర్శులు పలువురు మొక్కలు నాటారు.

*చిత్రం... ప్రగతిభవన్‌లో కేసీఆర్ జన్మదిన సందడి