తెలంగాణ

ఇన్నాళ్లకు అభివృద్ధి గుర్తుకొచ్చిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడ్తున్న కొద్దీ అధికార పార్టీకి అభివృద్ధి గుర్తుకు వస్తోందని బీజేపీ సోమవారం నాడు ఎద్దేవా చేసింది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో గ్రేటర్ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్ సన్నాహక సమావేశంలా జరిగిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కే కృష్ణసాగరరావు విమర్శించారు. ఆరేళ్లుగా గుర్తుకురాని హైదరాబాద్ నగర అభివృద్ధి అకస్మాత్తుగా తెరమీదకు వచ్చిందని ఆయన అన్నారు.
సీఏఏపై కేబినెట్ తీర్మానం చిత్తుకాగితం అన్న ఆయన దానిపై గవర్నర్ స్పందించాలని కోరారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఎన్‌పీఆర్‌ను ఆపాలని సవాలు విసిరారు.కేబినెట్ మీటింగ్‌లో కేవలం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సన్నాహక మీటింగ్ అయ్యిందని, ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా మార్చేశారని అన్నారు. ఇదే మొదలు కాదని, 2014నుండి కేసీఆర్ ఇదే మాదిరి చేస్తున్నారని , టీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వానికి పార్టీకి మధ్య వ్యత్యాసం లేకుండా పోయిందని అన్నారు. వాటి మధ్య సన్నటి వ్యత్యాస రేఖను కేసీఆర్ తుడిపేశారని అన్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం నిస్సిగ్గుగా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని , ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఖజానా నుండి ప్రజలకు నేరుగా లబ్ది చేసే ప్రైవేటు పనులు ప్రతిపాదిస్తున్నారని అన్నారు.
ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. 2014 నుండి ఇంత వరకూ తెలంగాణలో పట్టణాలు, నగరాలు పట్టలేదని, ఈ నెల 24 నుండే పట్టణ ప్రగతి ఎందుకు మొదలవుతోందని అన్నారు. దీనిపై తెలంగాణ ప్రజలు మేథావులు విజ్ఞతతో ఆలోచించాలని కృష్ణసాగరరావు అన్నారు. పట్టణ ఎన్నికలు వస్తేనే మున్సిపాల్టీలు గుర్తుకు వస్తున్నాయని , ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తేనే గ్రామాలు గుర్తుకువస్తున్నాయని అన్నారు.
జనాన్ని మోసం చేస్తూ అవకాశవాద రాజకీయాలు చేయడం కేసీఆర్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ డబ్బు 1500కోట్లు ఏం చేశారని నిలదీశారు. ఈ రోజు జీహెచ్‌ఎంసీ జీతాలు ఇవ్వలేని స్థితికి తెచ్చారని ఆరోపించారు. ఆరేళ్ల పాటు పట్టని హైదరాబాద్ అభివృద్ధి ఈ మూడు నెలల్లో చేస్తామని చెప్పడం విడ్డూరమని అన్నారు. టీఆర్‌ఎస్ వైఖరిని ప్రజలు, పౌరులు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. సీఏఏ ఆపాలంటూ కేబినెట్ తీర్మానం చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని, పార్లమెంటు చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసే హక్కు రాష్ట్రాలకు లేదని అన్నారు.