తెలంగాణ

2.31 లక్షల మందికి డిగ్రీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ నిర్వహించిన 33వ స్నాతకోత్సవంలో 2,31,573 మందికి డిగ్రీలు అందజేయగా, తెలంగాణ రీజనల్ కేంద్రంలో 1437 మందికి డిగ్రీలు అందజేశారు. తెలంగాణ రీజనల్ సెంటర్ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ భవనం వెంకట్రామ్ ఆడిటోరియంలో నిర్వహించారు. వ్యక్తిగతంగా హాజరై 150 మంది విద్యార్థులు తమ డిగ్రీలను ఈ కార్యక్రమంలో అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, వీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇగ్నో నివేదికను ఆవిష్కరించారు. హైదరాబాద్ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ఫయాజ్ అహ్మద్ రిపోర్టును సమర్పించారు. అనంతరం అహ్మద్ మాట్లాడుతూ తెలంగాణలో ఇగ్నోకు శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించాలని పాపిరెడ్డిని కోరారు. డిప్యుటీ డైరెక్టర్ డాక్టర్ కే రమేష్, డాక్టర్ పీఎం సౌజన్య, డాక్టర్ రాజు బొల్ల, డి ఆనందరెడ్డి తదితరులతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.