తెలంగాణ

డెడ్‌లైన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: ‘పట్టణాల్లో పనులన్నీ ప్రణాళికాబద్ధంగా జరగాలి. మూడు నెలల్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం పూర్తి కావాలి. ఎనిమిది నెలల్లో విద్యుత్ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారం కావాలి. లేని పక్షంలో సంబంధిత ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాలి’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. పల్లె ప్రగతి పునాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శంగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లపై ఉందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రగతిభవన్‌లో మంగళవారం నిర్వహించిన రాష్టస్థ్రాయి మున్సిపల్ సదస్సులో ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రతిప్రతినిధులు, అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్వహించే పాదయాత్రలు, కార్యక్రమాలను పేదలు ఎక్కువగా నివసించే దళితవాడల నుంచే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. వార్డుల
వారీగా ప్రగతి ప్రణాళికలను తయారు చేసుకొని దానికి అనుగుణంగా పనులు చేసుకుంటూ పోవాలని చెప్పారు. నిధుల వినియోగంలో కచ్చితమైన క్రమశిక్షణ పాటించాలని, ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాలని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సమీక్షించడానికి మండల పంచాయతీ అధికారులు గ్రామాల్లో పర్యాటించాల్సి ఉన్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీఏం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తమ పరిధిలోని గ్రామాల్లో రాత్రి బస చేసి పాదయాత్రలు నిర్వహించి పల్లె ప్రగతి లక్ష్యాలను సాధించాలని అన్నారు. సీఎం కేసీఆర్ చేసిన సూచనలు...
* వార్డుల వారీగా ప్రణాళికలు తయారు చేయాలి. ప్రతీ పట్టణానికి వార్షిక, పంచవర్ష ప్రణాళిక ఉండాలి. కౌన్సిలర్/కార్పొరేటర్లతో కలిసి ప్రణాళిక రూపొందించాలి. ప్రతీ వార్డుకు శాశ్వత ప్రాతిపదికన స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలి. ప్రతీ వార్డుకు ఏవేవి అవసరమో, ఏమేమి చేయాలో కచ్చితంగా నిర్ధారించుకోవాలి.
* మంచి పట్టణం/నగరం అంటే ఏమిటి? ఎలా ఉండాలి? అనేది ఎవరికివారు ప్రశ్నించుకోవాలి. ప్రతీరోజు చెత్త, మురుగును తొలగించి పరిశుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రమైన మంచినీటిని సరఫరా చేయాలి. వీధి లైట్లు వెలగాలి. రహదారులపై గుంతలు, గోతులు ఉండకూడదు. పచ్చదనంతో పట్టణాలు కళకళలాడాలి. దహన/ఖనన వాటికలు ఉండాలి. పట్టణ జనాభాకు అనుగుణంగా వెజ్/నాన్ వెజ్, ఫ్రూట్స్/్ఫ్లవర్ మార్కెట్లు ఏర్పాటు చేయాలి. క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ వ్యాయామశాలలు ఉండాలి. ఇవీ ఒక మంచి పట్టణం/నగరం లక్షణాలు.
* ప్రతీ పట్టణం/నగరంలో కనీస పౌర సదుపాయాలు ఉండాలి. వీటికే ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ స్థలాల్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి. మూడు నెలల్లో ఈ నిర్మాణాలు పూర్తి చేయాలి.
* స్ట్రీట్ వెండింగ్ జోన్ ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా స్థలం కేటాయించాలి. వాటిలో వౌలిక సదుపాయాలు కల్పించాలి.
* ఆటోలు, టాక్సీలు, ఇతర ప్రజా రవాణా వాహనాలకు నిర్దిష్టమైన ప్రదేశాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించాలి.
* విద్యుత్ సంబంధిత సమస్యలన్నింటినీ ఎనిమిది నెలల్లో పరిష్కరించాలి. వంగిన స్తంభాలు, తుప్పుపట్టిన స్తంభాలను తొలగించాలి. రోడ్డుకు అడ్డంగా ఉండే వాటిని తొలగించాలి. ఇళ్లపై వేలాడే తీగలను సరిచేయాలి. ఈ సమస్యలను పరిష్కరించకపోతే దానికి ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలి.
* పట్టణాల్లో చెట్లు పెంచే బాధ్యతను కౌన్సిలర్లు, కార్పొరేటర్లు స్వీకరించాలి. నాటిన మొక్కల్లో 85 శాతం బతికే బాధ్యతను వీరు చేపట్టాలి. పట్టణానికి అవసరమైన మేరకు నర్సరీలను ఏర్పాటు చేయాలి.
* ప్రతి పట్టణానికి ప్రతీ నెల రూ.148 కోట్ల చొప్పున ఆర్థిక సంఘం నిధులు విడుదల అవుతాయి. ఈ నిధుల వినియోగంలో క్రమశిక్షణ ఉండాలి. అప్పులు, జీతభత్యాలు, విద్యుత్, మంచినీటి బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించాలి. ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గాల నిధులను కూడా పట్టణ ప్రగతికి వినియోగించాలి.
* కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇళ్ల నిర్మాణం, లే అవుట్లకు సులభతరమైన అనుమతుల విధానం అమలు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు. నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తామని ప్రజలకు తెలియజెప్పాలి.
* జీవో 58, 59 ద్వారా గతంలో పట్టణాల్లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించినట్టే అన్ని మున్సిపాలిటీల్లో మరో అవకాశం కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది.

*చిత్రం...సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్