తెలంగాణ

ఇవేం చిల్లర రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: తెలంగాణ ప్రభుత్వం చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన పీయూష్ గోయల్ మంగళవారం పాత్రికేయులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీకి తొత్తుగా కేసీఆర్ మారారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల కోసమే ముస్లింలకు కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ అంటున్నారని ఆయన అన్నారు. 1951లో పాకిస్తాన్‌లో 23 శాతం ఉన్న మైనారిటీల సంఖ్య ఇపుడు మూడు శాతానికి పడిపోయిందని, వారంతా ఎక్కడికి వెళ్లారు? మరణించారా? లేక ఇస్లాం మతాన్ని పుచ్చుకున్నారా? లేదా వారు మన దేశంలో చొరబడ్డారా? ఒకవేళ అక్కడ మతపరమైన వేధింపులు, హింసకు గురై మన దేశంలోకి వచ్చిన వారందరికీ నీడనిచ్చి పౌరసత్వాన్ని కల్పించాలనే ఉద్దేశ్యం మోదీ సర్కారు చేసిన తప్పా అని ఆయన నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకించి రాజ్యాంగాన్ని అవమానించిందని ఆయన అన్నారు. అసలు సీఏఏతో ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన చెప్పారు. పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు వ్యతిరేకించలేవని సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ కూడా గతంలో అన్నారని కేంద్ర మంత్రి గోయల్ గుర్తుచేశారు.
కేసీఆర్ ఢిల్లీకి వచ్చి కేంద్రంతో కలిసి పనిచేస్తామని, అన్ని రాష్ట్రాలూ కేంద్రంతో కలిసి పనిచేయాలని చెప్పుకొచ్చారని, తీరా హైదరాబాద్ వచ్చాక కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా మంత్రివర్గంలో తీర్మానం చేయడం బాధాకరమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాష్ట్రంలోనూ అమలు చేయాలని అన్నారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన నిలదీశారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవితను నిజామాబాద్ స్థానం నుంచి ఓడించడం ద్వారా తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు గట్టి సందేశం పంపించారని పీయూష్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ వేగంగా బలం పుంజుకుంటోందని, ఆ విషయం వారికి ఇంకా తెలిసి రాలేదని పరోక్షంగా టీఆర్‌ఎస్ పార్టీ నేతలను ఉద్దేశించి అన్నారు. నిజం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని ఆయన అన్నారు. ఇదిలావుండగా ఢిల్లీకి ఎక్కుల నిధులు పంపే తెలంగాణను కూడా కేంద్రం చిన్నచూపు చూస్తోందని, రాష్ట్రాలకు మెహర్బానీ చేస్తున్నట్టు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గోయల్ మండిపడ్డారు. కేటీఆర్ తన కామెంట్లతో అవగాహనా
రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూడడం లేదని, ఇటీవలి రైల్వే బడ్జెట్‌లో తెలంగాణలోని వివిధ ప్రాజెక్టులకు 2,602 కోట్లు కేటాయించామని, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నట్టు ఐదు కోట్లు కాదని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ కృషితో చర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణానికి మార్గం సుగమమైందని, హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ఫేజ్-2తో పాటు అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రాజెక్టుల జాప్యానికి కేంద్రం కారణమే కాదని, రాష్ట్రం సకాలంలో భూ సేకరణ చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
పౌరసత్వ సవరణ చట్టంపై లేనిపోని విషయాలను ప్రచారం చేసి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజలను భయభ్రాంతులను చేశారని గోయల్ మండిపడ్డారు. దానికి అనుగుణంగానే టీఆర్‌ఎస్ సర్కార్ అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామనడం చాలా బాధాకరమని ఆయన అన్నారు.
తెలంగాణకు సంబంధించి నేడు ( ఫిబ్రవరి 18) చాలా కీలకమైన రోజని, ఆరేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున విభజన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుర్తుచేశారు. కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఇతర నేతలు పాల్గొన్నారు.

*చిత్రం... హైదరాబాద్‌లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్