తెలంగాణ

మున్సిపల్ కమిషనర్ల భారీ కుదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్లను భారీ ఎత్తున బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్‌గా జకీర్ అహ్మద్‌ను నియమించారు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌గా ఆకుల వెంకటేశం, లక్సెట్టిపేట మున్సిపల్ కమిషనర్‌గా ఆర్. త్రియంబకేశ్వరరావును నియమించారు. నాగర్‌కర్నూలు మున్సిపల్ కమిషనర్‌గా గోనా అనే్వష్, జగిత్యాల కమిషనర్‌గా కే జయంత్ కుమార్‌రెడ్డి, నిర్మల్ కమిషనర్‌గా నల్లమల బాకకృష్ణ, అమీన్‌పూర్ కమిషనర్‌గా సుజాత, ఆలియా కమిషనర్‌గా పీ వేమనరావు, తెల్లాపూర్ కమిషనర్‌గా వెంకట మణికర్ణన్‌ను నియమించారు. షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా లావణ్య, సంగారెడ్డి కమిషనర్‌గా బీ శరత్ చంద్ర, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌గా ప్రశాంతి, తాండూరు మున్సిపల్ కమిషనర్‌గా కే శ్రీనివాస్‌రెడ్డి, శంషాబాద్ కమిషనర్‌గా సాబర్ అలీని నియమించారు. నర్సంపేట మున్సిపల్ కమిషనర్‌గా ఎస్. విద్యాసాగర్, పరకాల కమిషనర్‌గా బీ యాదగిరి, పెద్దపల్లి కమిషనర్‌గా సీహెచ్. తిరుపతి, వేములవాడ కమిషనర్‌గా మట్టా శ్రీనివాస్‌రెడ్డి, సత్తుపల్లి కమిషనర్‌గా కే సుజాతను నియమించారు. ఎల్లందు కమిషనర్‌గా వీరేందర్, మందమర్రి కమిషనర్‌గా గద్దెరాజు, వనపర్తి మున్సిపల్ కమిషనర్‌గా మహేశ్వర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌గా రజనీకాంత్‌రెడ్డి, సదాశివపేట మున్సిపల్ కమిషనర్‌గా స్పందన, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా ఖమర్ అహ్మద్, హుజూర్‌నగర్ కమిషనర్‌గా భట్టు నాగిరెడ్డి, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా బీ. గంగాధర్, యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్‌గా జంపాల రజిత, నందికొండ కమిషనర్‌గా పల్లారావు, చిట్యాల కమిషనర్‌గా ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌గా ముకుంద్‌రెడ్డిని నియమించారు. అలాగే నళినీ పద్మావతిని మున్సిపల్ పరిపాలనా డైరెక్టరేట్‌లో జాయింట్ డైరెక్టర్‌గా, వేణుగోపాల్‌రెడ్డిని మున్సిపల్ డైరెక్టరేట్‌లోనే డిప్యూటీ డైరెక్టర్‌గా, ఆమన్‌గల్ మున్సిపల్ కమిషనర్‌గా శ్యాంసుందర్‌ను నియమించారు.