తెలంగాణ

ఎర్ర బస్సులే తప్ప, రైళ్లు తెలీవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: నరేంద్రమోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చేంత వరకూ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎర్రబస్సులే తప్ప రైళ్లు తెలీవని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే క్రమంలో కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు రైలు అంటే అలవాటు లేదని, బీజేపీ అధికారంలోకి వచ్చేంత వరకూ అసలు రైలంటే తెలీదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడంపై రాష్ట్ర మంత్రులు సైతం తప్పుపడుతున్నారు. తెలంగాణలో రైళ్ల సౌకర్యం బాగా పెరిగిందని చెప్పాలని భావించిన కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయ్యాకనే తెలుగు రాష్ట్రాల్లో అనేక కొత్త రైళ్లు ప్రారంభం అయ్యాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 427 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సౌకర్యం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.