తెలంగాణ

ఆర్టీసీ యాజమాన్యం కోర్టు ధిక్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఆర్టీసీ మేనేజ్‌మెంట్ సీసీఎస్‌కు చెల్లించాల్సిన డబ్బులో రూ. 200 కోట్లు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసి మూడు మాసాలు గడుస్తున్నా చెల్లించకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడుతోందని టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయాస్ యూనియన్ ఆరోపించింది. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంప్లాయాస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్.బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ మేనేజ్‌మెంట్ నేటివరకు సీసీఎస్‌కు రూ. 619 కోట్లు బకాయి పడిందనీ.. ఉద్యోగుల జీతాల నుండి రికవరీ చేసిన ఈ డబ్బును ఆర్టీసీ వాడుకోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై లోతైన విశే్లషణ జరిపి సమస్యలకు కారణమవుతున్న అధికారులను కౌనె్సలింగ్ జరిపి ఉద్యోగులు, రిటైరైన ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బాబు కోరారు.