తెలంగాణ

బీసీ డిమాండ్ల సాధన కోసం మార్చిలో జనగర్జన, మహాసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాలకు చెందిన వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మార్చి 23వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో ‘బీసీల జనగణ గర్జన’ మహాసభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు, జాతీయ సమన్వయకర్త శ్రీనివాస్ గౌడ్, ఏపీ సంఘం అధ్యక్షుడు శంకర్‌రావు, అఖిల భారత బీసీ సమాఖ్య తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ బాస్కర్‌లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. బడ్జేట్ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి పలు డిమాండ్ల సాధన కోసం మూడు రోజుల పాటు ఆందోళనలు నిర్వహిస్తారని, మార్చి 23న జరిగే ఆందోళనకు పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం ఉన్న పార్టీలను, జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో వివిధ బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించి భవిష్యత్ ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు.