తెలంగాణ

కాంట్రాక్ట్ ఉద్యోగుల లెక్క తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 18: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షతన ఏర్పాటైన వర్కింగ్ కమిటీ సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు గతంలో ప్రభుత్వం జీఓయం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్)ను ఏర్పాటు చేయగా ఈ వర్కింగ్ కమిటీ వచ్చే మార్చి 31లోగా జీఓఎంకు నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వర్కింగ్ కమిటీ సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా సీఎస్ సాహ్ని మాట్లాడుతూ ప్రతి శాఖలో ఎంత మంది కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నదీ స్పష్టంగా గుర్తించి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను నంబర్ స్టేట్‌మెంట్ల ప్రకారం కొంత వరకు గుర్తించామని, ఇంకా పూర్తి వివరాలను ఆయా శాఖాధిపతులు నిర్ధారించి అందజేయాల్సి ఉందన్నారు. సమావేశంలో అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, న్యాయ శాఖ కార్యదర్శి జీ మనోహర్‌రెడ్డి, సర్వీసెస్ శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఒ మల్లికార్జున్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.