తెలంగాణ

ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) కోరింది. ఈ మేరకు టీఈఏ రాష్ట్ర సంఘం అధ్యక్షులు సీహెచ్. సంపత్ కుమార స్వామి నేతృత్వంలో టీఈఏ సెంట్రల్ అసోసియేషన్ అత్యవసరంగా మంగళవారం ఇక్కడ సమావేశమైంది. ఈ సందర్భంగా సంపత్ కుమార్ తదితరులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతిగా పేరుతెచ్చుకున్నారని, ఆయన వెంటనే జోక్యం చేసుకుని ఐఆర్ ఇవ్వాలని కోరారు. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుండి 61 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దుచేసి పాత పిన్షన్ విధానం అమల్లోకి తేవాలని కోరారు.
ఈ సమావేశంలో టీఈఏ నేతలు గడ్డం బాలస్వామి, పి. పురుషోత్తం, టీఈఏ మహిళా విభాగం అధ్యక్షురాలు జీ. నిర్మల, అసోసియేట్ అధక్షురాలు సైఫాబేగం తదితరులు పాల్గొన్నారు.