తెలంగాణ

పీఆర్‌సీ గడువు డిసెంబర్ వరకు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) గడువును 2020 డిసెంబర్ 31 వరకు పెంచారు. ఈ మేరకు మంగళవారం ఒక జీఓ (ఆర్‌టీ నెంబర్ 447..జీఏడీ) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరుతో జారీ అయింది. 2018 మే లో ఐఏఎస్ (రిటైర్డ్) అధికారి సీ ఆర్ బిస్వాల్ నేతృత్వంలో ఏర్పాటైన పీఆర్‌సీకి మొదట ఏడాది గడువు ఇచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఈ గడువును 2020 ఫిబ్రవరి 25 వరకు పెంచారు. మంగళవారం విడుదలైన తాజా ఉత్తర్వులతో పీఆర్‌సీ గడువు మరో 10 నెలల పాటు పొడిగించినట్టయింది. ఈ పెంపుదల ఉద్యోగుల్లో తీవ్రమైన ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే పీఆర్‌సీ అమల్లోకి రావలసి ఉన్నప్పటికీ అమల్లోకి రాలేదు. కనీసం మధ్యంతర భృతి (ఐఆర్) అయినా ప్రభుత్వం ఇస్తుందేమోనని గత ఏడాదికాలంగా ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నారు.
67 శాతం డీఏ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. 2014 లో తెలంగాణ ఏర్పాటు కాగానే అప్పట్లో పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ సిఫార్సులను పరిశీలించి 43 శాతం ఫిట్‌మెంట్ ఇస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు చేసిన డిమాండ్ కన్నా ఎక్కువ మొత్తానే్న కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యోగుల్లో అప్పట్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మొట్టమొదటి పీఆర్‌సీ ని బిస్వాల్ నేతృత్వంలో 2018 లో నియమించారు. ఈ పీఆర్‌సీపై ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. పీఆర్‌సీ అమలు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో మధ్యంతర భృతి (ఐఆర్) అయినా ప్రభుత్వం ఇస్తుందేమోనని ఉద్యోగులు ఎదురు చూస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఐఆర్‌ను కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఒకటి రెండు నెలల్లో పీఆర్‌సీ అమల్లోకి వస్తుందని భావించిన ఉద్యోగులకు ఇప్పుడు గడువు పెంచడంతో నిరాశ ఎదురైంది. పీఆర్‌సీ గడువు 2020 డిసెంబర్ వరకు పొడిగించడం పట్ల ఉద్యోగులంతా ఆందోళనకు గురవుతున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించకపోయినా, జాప్యం చేసినా ఆందోళన, సమ్మె చేసే వారు. ఇప్పుడు ఏ ఉద్యోగ సంఘం కూడా సమ్మె చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇటీవల ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె విషయంలో రాష్ట్రప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా భయం చోటుచేసుకుంది. టీఎన్‌జీఓల సంఘం అధ్యక్షుడు ఇటీవల ఒక సందర్భంలో పీఆర్‌సీని 2020 జనవరి చివరి వరకు అమలు చేయకపోతే తమ సంఘం భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకుంటుందని ప్రభుత్వాన్ని పరోక్షంగా హెచ్చరించారు. ఈ హెచ్చరికను ప్రభుత్వం ఏ మాత్రం ఖాతరు చేయలేదని వాస్తవ పరిస్థితి వెల్లడిస్తోంది.
బిస్వాల్ నేతృత్వంలోని పీఆర్‌సీ గడువు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం తీసుకున్న నిర్ణయం రాష్టవ్య్రాప్తంగా చర్చనీయాంశంగా మారింది.