తెలంగాణ

మహిళా కమిషన్ ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తక్షణమే మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని టీపీసీసీ గవర్నర్‌ను కోరింది. మంగళవారం ఇక్కడ టీపీసీసీ అధికారప్రతినిధి ఇందిరా శోభన్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో మహిళ కమిషన్ లేనందు వల్ల మహిళలు తమకు జరిగిన అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేకపోతున్నారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అన్ని ఆకృత్యాలకు కారణం మద్యమన్నారు. రాష్ట్రంలో ప్రతి వీధికి ఒక బెల్ట్‌షాపు ఉంన్నారు. ఆర్‌టీఐ ద్వారా తాము సేకరించిన సమాచారం మేరకు దాదాపు 17952 షాపులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం కేవలం ఆదాయం కోసమే వీటిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ప్రజల మాన ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. బెల్ట్‌షాపులను రద్దు చేసి మద్య రహిత రాష్ట్రంగా చేయాలని ఆమె గవర్నర్‌నుకోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు జరుగుతున్న అన్యాయాల పట్ల ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయనున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ మార్క్‌ఫెడ్ ద్వారా జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా వివిధ రాయితీలు , సహాయక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం జగిత్యాల మార్కెట్‌లో కేవలం రూ.4వేలకే పరిమితం కావడం రైతాంగాన్ని కుదేలు చేస్తోందన్నారు. కేంద్రం మాత్రం క్వింటాల్ రేటు రూ.5800 ఉండాలని నిర్ణయించిందనానరు. వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర లభించని పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు.
కందులకు వ్యవసాయ మార్కెట్లో కనీస మద్దతు ధర లభించలేని పరిస్థితుల్లో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో కనీస మద్దతు ధరకు కందులు కొనుగోలు చేయాలన్నారు.

*చిత్రం... గవర్నర్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించిన టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్