తెలంగాణ

20 లక్షల లీటర్లకు విజయ డెయిరీ సామర్థ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: విజయ డెయిరీ సామర్థ్యాన్ని 15లక్షల నుండి 20లక్షల లీటర్లకు పెంచడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర పాడి పరిశ్రమ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో శుక్రవారం విజయ డెయిరీ నూతన ప్యాకింగ్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయ డెయిరీ ద్వారా ప్రస్తుతం ఐదులక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నామని 15 నుంచి 20లక్షల లీటర్లకు పెంచనున్నట్టు చెప్పారు. తెలంగాణలో 86,515 పాల ఉత్పత్తి దారుల నుండి పాల సేకరణ చేస్తున్నట్టు, లీటరుకు నాలుగు రూపాయల ప్రోత్సాహకం అందిస్తున్నట్టు చెప్పారు. దీని కోసం 46.50 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు తెలిపారు. విజయ తెలంగాణ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పాడి అభివృద్ధికి ఎన్‌సిడిసి ద్వారా రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. రైతులకు అందుబాటులో ఉండే విధంగా 100 సంచార వైద్య శాలలను ఏర్పాటు చేసి సిబ్బంది డాక్టర్లతో పాటు మందులు అందుబాటులో ఉంచనున్నట్టు చెప్పారు. సమావేశంలో విజయడెయిరీ ఎండి శ్రీమతి నిర్మల, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.