తెలంగాణ

కాళేశ్వరం జలాలతో పొంగుతున్న వాగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, ఫిబ్రవరి 19: వర్షాకాలంలో విపరీతంగా వర్షాలు కురిసినప్పటికీ అనేక ప్రాంతాలలోని చెరువులు,కుంటలు నిండిపోవడంతో పాటు అందులోని కొన్ని మాత్రమే నామమాత్రంగా వారం, పది రోజుల పాటు నీటితో పొంగిపొర్లడం వంటివి సహజంగా చూస్తుంటాం. అయితే ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏమీ ఉండదు. కానీ ఇతర సీజన్‌లో ఊహించని స్థాయిలో వచ్చి చేరుతున్న నీటితో చెర్వులు, కుంటలు నిండిపోవడమే గాకుండా పొంగిపొర్లడం వంటి సంఘటనలు వినడంతోపాటు చూసే వారికి ఎంతైనా విచిత్రమే కదా.. ముఖ్యంగా ఒక వారమో లేక పది రోజులో లేక నెల రోజుల పాటో చెరువులు పొంగిపొర్లుతున్న విషయం కొంత వరకు ఆశ్చర్యమే కలిగిస్తుంది. అయితే దాదాపుగా మూడు మాసాల నుండి కొన్ని చోట్ల చెరువులు, మరికొన్ని చోట్ల కుంటలు పొంగిపొర్లుతుంటే పరిస్దితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్ రెండో దశకాలువల ద్వారా ఏకధాటిగా వస్తున్న జలాలతో తుంగతుర్తి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలలో పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలతో యావత్ ప్రజానీకం నివ్వెరపోతోంది. మొదటి నుండి ఎలాంటి నీటి ప్రాజెక్టులకు నోచుకోక కరవుపరిస్థితులకు అద్దం పట్టే నియోజకవర్గంపై కాళేశ్వరం జలాలు గత నాలుగా మాసాలుగా పారుతూ రైతుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ మూడోవారం నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా కొడకండ్ల మండల పరిధిలో ఉన్న బయ్యన్నవాగు రిజర్వాయర్ నుండి వస్తున్న కాళేశ్వరం జలాలు నేటికి కూడా (నాలుగు మాసాలుగా) సూర్యాపేట జిల్లా వైపు శ్రీరాంసాగర్ రెండోదశ కాలువలకు ఉన్న 69,70,71 డిస్ట్రిబ్యూటరీల ద్వారా పరుగులు తీస్తున్నాయి. అయితే రెండోదశకు ప్రారంభంలోనే ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, నాగారం, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలలోఉన్న 214 చెరువులు, కుంటలన్నీ పూర్తిస్థాయిలో నిండిపోగా పెద్ద సంఖ్యలో కొన్ని అలుగులుపోస్తున్నాయి. తిరుమలగిరి మండలంలో 23, తుంగతుర్తి మండలంలో 54, మద్దిరాల, అర్వపల్లి మండలాలో 40 చొప్పున, నాగారం మండలంలో 26, నూతనకల్ మండలంలో 31 చెరువులు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలోనే అతిపెద్ద చెరువుల్లో ఒకటిగా పేరుగాంచిన వెలుగుపల్లి గ్రామ పరిధిలోని రుద్రమ్మచెరువు పూర్తి స్థాయిలో నిండిపోయి అలుగులు పోస్తోంది. వెంపటి, రావులపల్లి, గుండెపురి, గొట్టిపర్తితో పాటు పెద్ద సంఖ్యలోని గ్రామాల చెరువులు పూర్తి స్థాయలో నిండిపోయి మూడు మాసాలుగా అలుగులు పోస్తున్నాయి. ఈ పరిణామాలతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ప్రజానీకం అనేక గ్రామాలలో గోదావరి నీళ్ళకు వివిధ రూపాలుగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ తుంగతుర్తి మండలంలో జరిపిన ఒక పర్యటన సందర్బంగా వెలుగుపల్లి రుద్రమ్మ చెరువుని పరిశీలించి పొంగిపొర్లుతున్న జలాలకు పూజలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌లను దేవుళ్ళుగా పూజల్లో కొనియాడుతున్నారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు పూర్తి స్థాయి లో సరిహద్దుల్లో ఉ న్న పాలే రు వాగునీళ్లు కేతిరెడ్డి ఆనకట్టమీదుగా నీరు మూ డు మాసాలుగా పొంగిపొర్లడం తొలి సంఘటనగా అక్కడి ప్రజానీకం కొనియాడుతున్నారు.

*చిత్రం...అలుగుపోస్తున్న వెంపటి గ్రామ పెద్దచెర్వు