తెలంగాణ

మార్చి 15న అమిత్‌షా రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్చి 15వ తేదీన హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ గురువారం నాడు చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టంపై ఉన్న అన్ని అనుమానాలను అమిత్ షా నివృత్తి చేస్తారని ఆయన చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే ఎల్‌బీ స్టేడియం అధికారులతో కూడా సంప్రదించినట్టు ఆయన తెలిపారు. సభలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నారు. ఎంఐఎంతో చెట్టాపటాలువేసుకుంటున్న టీఆర్‌ఎస్ సీఏఏకు వ్యతిరేకంగా
మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ రెండు పార్టీలూ కలిపి సీఏఏ , ఎన్‌సీఆర్, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాలను బీజేపీ ఇప్పటికే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తోందని, అయితే ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకే అమిత్ షా బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ అధికారపార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇస్తున్న సీఎం ఎన్నికల తర్వాత వాటన్నింటినీ మరిచిపోతున్నారని పేర్కొన్నారు.
ఎంఎస్‌ఎంఈల కీలక పాత్ర
తెలంగాణ దిశా దశ మార్చడంలో ఎంఎస్‌ఎంఈలు కీలకపాత్ర పోషిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈల ఆధ్వర్యంలో గురువారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ ఒక జిల్లా - ఒక ఉత్పత్తి’ సదస్సులో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల కోసం పట్టిణాలకు వలస వెళ్లే పరిస్థితి మారాలని అన్నారు. పెందుర్తి, నిర్మల్, తాండూరు, ఖమ్మం, సిరిసిల్ల, గద్వాలలో ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టులకు అనేక అవకాశాలున్నాయని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో చిన్న పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదని అన్నారు. పది మంది కలిసి క్లస్టర్‌గా ఏర్పడి చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు.
ఉద్యోగులకు అండ
ఏపీలో ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వారికి అండగా నిలిచారని లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణలో ఉద్యోగ సంఘాల నేతలు పదవులకు లోబడి ఉద్యోగులను మోసం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు పదవులు దక్కించుకున్నారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారిపై బెదిరింపులకు దిగుతోందని అన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంలు కుమ్మక్కై సీఏఏపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని అన్నారు.
ఆరు జిల్లాలపై ఏకాభిప్రాయం
పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై చర్చించేందుకు బీజేపీ నేతలు దశల వారీ సమావేశమై ఏకాభిప్రాయాన్ని సాధిస్తున్నారు. మంచిర్యాల ,కరీంనగర్, వేములవాడ, మెదక్, రంగారెడ్డి, గద్వాల జిల్లాల అధ్యక్షుల ఎంపికపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని తెలిసింది.

*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్