తెలంగాణ

28న డీసీసీబీ ఎన్నికల భేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) పాలక వర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు స్టేట్ కో-ఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 22న ఎన్నికల నిర్వహణకు నోటీస్ జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఉమ్మడి 10 జిల్లాల వారీగానే డీసీసీబీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు
కో-ఆపరేటివ్ ఎలక్షన్ ఆథారిటీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా, డీసీసీబీ కార్యవర్గ సభ్యుల ఎన్నికకు 25న ఉదయం 8 గంటల నుంచి ఒంటి గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత 1-30 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన చేస్తారు. అదే రోజు సాయంత్రం 3.30 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత 25వ తేదీన ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ మరుసటి రోజు 29న డీసీసీబీ పాలకవర్గాలను ఎన్నుకుంటారు. డీసీసీబీలో మొత్తం 20 మంది డైరెక్టర్లకుగాను 16 స్థానాలను వివిధ వర్గాలకు రిజర్వు చేశారు. మిగిలిన నాలుగు డైరెక్టర్ పోస్టులను వివిధ సొసైటీలకు రిజర్వు చేశారు. వీటిని కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలకు ఒక్కో డైరెక్టర్‌ను రిజర్వు చేశారు. కాగా, రిజర్వు చేసిన 16 మంది డైరెక్టర్లలో ఎస్సీలకు-3, ఎస్టీలకు-1, బీసీలకు-2, జనరల్ కేటగిరీకి-10 డైరెక్టర్ పోస్టులను రిజర్వు చేశారు. వివిధ కేటగిరీలకు రిజర్వు చేసిన డైరెక్టర్ స్థానాలకు వేర్వేరు రంగుల్లో బ్యాలెట్ పత్రాలను ముద్రించనున్నట్టు కో-ఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ పేర్కొంది. ఎస్సీ కేటగిరీ బ్యాలెట్ పత్రాలను గులాబి రంగులో, ఎస్టీ కేటగిరీ బ్యాలెట్ పత్రాలు లేత నీలం రంగులో, బీసీ కేటగిరీ బ్యాలెట్ పత్రాలను లేత ఆకుపచ్చ రంగులో, జనరల్ కేటగిరీ బ్యాలెట్ పత్రాలను తెల్ల రంగులో ముద్రించనున్నట్టు పేర్కొన్నారు.