తెలంగాణ

‘పట్టణ ప్రగతి’ని విజయవంతం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ప్రభుత్వం తలపెట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉద్యోగులంతా శ్రద్దతో, చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. పట్టణ ప్రగతి ఏర్పాట్లపై గురువారం ఆయన బూర్గుల రామకృష్ణారావు (బీఆర్‌కే) భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ నెల 24 న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందు వల్ల ప్రభుత్వ ఆశయాల మేరకు ఉద్యోగులంతా పనిచేయాలని సూచించారు. పట్టణాల్లో ప్రతి వార్డుకు నాలుగు కమిటీలను నియమించాలని ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉండాలని సూచించారు. ప్రతి వార్డుకు ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల వారీగా పూర్తి వివరాలను వెంటనే సేకరించాలని సూచించారు. పురపాలక వ్యవహారాల శాఖ పట్టణ ప్రగతికోసం ఒక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. పట్టణ ప్రగతి వివరాలను పొందుపరిచేందుకు వీలుగా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.
సానిటేషన్, హరితహారం, సామూహిక మరుగుదొడ్లు, నర్సరీలు, కాయగూరల మార్కెట్, నాన్‌వెజ్ మార్కెట్లు, క్రీడామైదానాలు, పార్కులపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా నిరక్షరాస్యుల వివరాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. పల్లెప్రగతి సందర్భంగా నిరక్షరాస్యుల వివరాలు సేకరించేందుకు రూపొందించిన ఫాం తరహాలోనే పట్టణ ప్రగతి కోసం ఫాంను రూపొందించారు. ఈ తరహా సర్వే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, కంటోనె్మంట్ ప్రాంతంలో కూడా చేయాల్సి ఉంటుందన్నారు.
జీహెచ్‌ఎంసీ కోసం 156 కోట్ల రూపాయలను, ఇతర నగరాలు, పట్టణాలకోసం 140 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ కేటాయించింది. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి 14 వ ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్ల నుండి నిధులను విడుదల చేస్తున్నారు. మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ వ్యవహారాల కమిషనర్ అండ్ డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
*చిత్రం...ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న సీఎస్ సోమేశ్ కుమార్