తెలంగాణ

రష్మికపై కలెక్టర్ పేరుతో ట్వీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఫిబ్రవరి 20: సినీనటి రష్మికపై జగిత్యాల జిల్లా కలెక్టర్ పేరిట వచ్చిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. రష్మిక తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను ట్వీట్‌లో ఉంచగా పలువురు తమ కామెంట్లను పెట్టారు. అయతే, రష్మికను ఉద్దేశించి ‘చంపావ్ పో‘ అంటూ జగిత్యాల కలెక్టర్ రవి పేరుతో వచ్చిన ట్విట్టర్ తీవ్ర దుమారం రేపింది. కలెక్టర్ స్థాయ వ్యక్తి ఇలాంటి కామెంట్ చేయడమేమిటని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయ. ఈ విషయం కలెక్టర్ రవి దృష్టికి సైతం రావడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ఆ ట్వీట్ తాను చేయలేదని, ఎవరో తన అకౌంట్‌ను హ్యాక్ చేశారని వివరణ ఇచ్చారు. తర్వాత దీనిపై పోలీసులకు సైతం సమాచారం ఇచ్చారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు కలెక్టర్ అకౌంట్ హ్యాకింగ్ జరిగినట్టు గుర్తించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులు దానికి కారణమని గుర్తించారు. దీంతో కలెక్టర్ వెంటనే వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.