తెలంగాణ

హద్దు మీరితే.. ఖబడ్దార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: నియమనిబంధనలను కాలరాసి యధేచ్ఛగా కాలేజీలు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై ఇక ఎంత మాత్రం ఉదాసీనంగా వ్యవహరించేది లేదని విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్ హెచ్చరించారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌లతో కలిసి ఆమె శనివారం నాడు కాలేజీల యాజమాన్యాలతో భేటీ నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు సైతం నిబంధనలను ఉల్లంఘించిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని, కనుక అన్ని కాలేజీల యాజమాన్యాలూ నిబంధనలను పాటించాల్సిందేనని పేర్కొన్నారు. అగ్నిమాపక యంత్రాలు సమకూర్చుకోని కాలేజీలు, వేరే చోట ప్రారంభించి ఊళ్లు మార్చేసిన కాలేజీలు కూడా ఉన్నాయని, అటువంటి కాలేజీలు బోర్డు అనుమతి పొందాల్సిందేనని లోపాలను మూడు రోజుల్లో సరిదిద్దుకుని తగిన సమాధానం బోర్డుకు ఇవ్వాలని పేర్కొన్నారు.
అగ్నిమాపక శాఖ ముందస్తు భద్రతా ధృవీకరణ పత్రాలను అందజేయాలని గత ఏడాదే కొన్ని కాలేజీలకు సూచించామని, అయితే ఆయా యాజమాన్యాలు కాలేజీలను వేరే భవనాల్లోకి మారుస్తామని గత ఏడాది చెప్పాయని అధికారులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఫిబ్రవరి 25లోగా కోర్టుకు సమాధానం చెప్పుకోవల్సి ఉందని కనుక యాజమాన్యాలు తమ లోపాలను సరిదిద్దుకోవాలని వారు పేర్కొన్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదని, విద్యార్థుల భద్రత దృష్ట్యా అగ్నిమాపక నివారణ యంత్రాలను అన్ని కాలేజీల్లో ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన అంశాన్ని వారు గుర్తుచేశారు. పరీక్షలు పూర్తయ్యే వరకూ తమకు గడువు ఇవ్వాలని, పరీక్షలు ముగిశాక, వేసవి సెలవుల్లో తగిన చర్యలను తీసుకుంటామని ఈ సందర్భంగా యాజమాన్యాల ప్రతినిధులు పేర్కొన్నారు.