తెలంగాణ

ఆహార అలవాట్లు, జీవనశైలి మారితేనే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ప్రజల జీవన శైలివల్లే సమాజంలో వింత జబ్బులు వస్తున్నాయని, ఆహారపు అలవాట్లు మారాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజల్లో సోమరితనంతో పాటు జంక్‌ఫుడ్ ప్రభావం పోవాలని సూచించారు. శనివారం నాడు ఆయన ముచ్చింతల్‌లోని స్వర్ణ్భారతి ట్రస్టు , యశోద ఆస్పత్రి సంయుక్తంగా నిర్వహించిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పద్మ అవార్డు గ్రహీతలు పీవీ సింథు, భాష్యం విజయసారధి, చింతల వెంకటరెడ్డిలను సన్మానించారు. అనంతరం ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ బ్యాలెట్ ద్వారా ఎంత పెద్దవారినైనా దించేయవచ్చు, కొందరు సృష్టిస్తున్న హింసను ప్రజలు చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు, విధ్వంసం సమాజానికి మంచిది కాదు, విధ్వంసాన్ని ప్రొత్సహించడం కూడా తప్పే , 12 మంది రైతులకు ఈసారి పద్మ అవార్డులు రావడం చాలా గొప్ప విషయం, పేరు తేచ్చే వారిని సన్మానిస్తే సమాజం తనను తాను గౌరవించుకున్నట్టు అని అన్నారు. ప్రజల జీవన శైలి వల్లనే సమాజంలో వింత జబ్బులు వస్తున్నాయని, ప్రజల్లో సోమరితనం పెరుగుతోందని, జంక్‌ఫుడ్ ప్రభావం పోవాలని చెప్పారు.
అంతర్జాతీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న భారతదేశంలో యువశక్తే ప్రధాన బలమని, అలాంటి యువతకు సరైన నైపుణ్యాలను అందించాలని అన్నారు. వారిలో ఉన్న ప్రతిభకు పదనుపెట్టి దేశ సమగ్ర సుస్థిరాభివృద్ధిలో వారిని భాగస్వామ్యులను చేయాలని అన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కార్పోరేట్ రంగం, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు తోడుగా నిలిస్తే మరిన్ని అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని చెప్పారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు సరైన ప్రోత్సాహాన్ని అందించడాన్ని కూడా కార్పోరేట్ రంగం సీఎస్‌ఆర్ ద్వారా బాధ్యత తీసుకోవాలని అన్నారు.
ప్రతిభను గుర్తించడం, దానిని గౌరవించుకోవడం భారత సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమని, ప్రతిభను గౌరవించడం కూడా కేవలం ఆ వ్యక్తికి మాత్రమే దక్కిన గౌరవం కాదని అన్నారు. వారు సాధించిన విజయాలను నడిచిన బాటను ఇతరులు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని గుర్తుచేసుకోవడమేనని పేర్కొన్నారు. గతంలో అధికార పక్షాలకు సన్నిహితంగా ఉండే వారికే అవార్డులు దక్కేవని అలాంటి పరిస్థితిని నరేంద్రమోదీ ప్రభుత్వం మార్చేసిందని అన్నారు. ఇన్నాళ్లూ గుర్తింపునకు నోచుకోని వారిని గుర్తించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
పేదలకు దూరమైన వైద్యాన్ని దగ్గర చేయడమే స్వర్ణ్భారతి ట్రస్టు లక్ష్యమని, విద్య, వైద్యం, నైపుణ్యం పెంపొందించడమే ట్రస్టు ఉద్ధేశ్యమని అన్నారు. ప్రకృతిని నిర్లక్ష్యం చేసినందుకు మానవాళిపై ఉగ్రరూపం చూపిస్తోందని, దేశం వేగంగా ముందుకు వెళ్తున్నా, ఇంకా చాలా మంది వెనుకబడే ఉన్నారని అన్నారు. మాతృభాషను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. మాతృభాషలో ప్రతిభ ఉంటేనే ఇతర భాషలను నేర్చుకోగలుగుతామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు లక్ష్మణ్, ఎన్ రామచందర్‌రావు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పద్మ అవార్డు గ్రహీతలకు సత్కారం
పద్మ అవార్డు గ్రహీతలు పీవీ సింధు, చింతల వెంకటరెడ్డి, విజయసారధి శ్రీ భాష్యంలను ఉప రాష్ట్రపతి ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ గుర్తింపునకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

*చిత్రం... పద్మ అవార్డు గ్రహీత శ్రీ భాష్యం విజయసారధిని సత్కరిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు