బిజినెస్

పేరుకే ఫ్రెండ్లీ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్‌సీ (వేతన సవరణ సంఘం) సిఫార్సులను అమలు చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని 4 లక్షల మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు, సుమారు 3 లక్షల పెన్షనర్లకు వర్తించే పీఆర్‌సీని ఆశించిన రీతిలో ఫిట్‌మెంట్‌తో వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. దాదాపు 42 రోజుల పాటు సకల జనుల సమ్మె చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఉద్యోగులు స్వరాష్ట్రం సిద్ధిస్తే తమ హక్కులన్నీ సకాలంలో నెరవేర్చుకోవచ్చునని భావించారని
ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఒకవైపు చెప్పుకుంటనే వారి హక్కులను కాలరాస్తూ కనీసం వారికి రావాల్సిన ఆర్థికపరమైన అంశాలను సకాలంలో అందజేయడం లేదని ఆయన విమర్శించారు. పీఆర్‌సీ విషయానికి వస్తే 2018 జూలై 1వ తేదీ నుంచి రావాల్సిన 11వ పీఆర్‌సీని 20 నెలలు గడుస్తున్నా ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. పైగా కమిటీ కాలపరిమితిని మరో పది నెలల పాటు పొడిగించడం ఎంతవరకు సమంజసమన్నారు. అసలు కమిటీ కాలపరిమితిని ఎందుకు పొడిగించారన్నారు. కమిటీ పొడిగింపు కోసం కమిటీ సభ్యులు మీకు చెప్పిన అంశాలను ఎందుకు పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం లేదన్నారు. ఒకవైపు ఆర్థికంగా రాష్ట్రం నెంబర్ వన్ అని చెప్పుకుంటూనే ఉద్యోగులకు మాత్రం పీఆర్‌సీ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఈ ఆరేళ్లలో వేలాది మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందినందున ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గిందన్నారు. అయినా కూడా ప్రభుత్వం పీఆర్‌సీ ఇవ్వడం లేదన్నారు. పీఆర్‌సీ కాలపరిమితి ఐదు సంవత్సరాలేనని ఆయన చెప్పారు. మూడు సంవత్సరాల వరకు ఫిట్‌మెంట్ ఇవ్వకపోతే, ఉద్యోగులు, మూడేళ్లపాటు ఆర్థికంగా నష్టపోయినట్లేనని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లు మధ్యంతర భృతిని కూడా ప్రకటించలేదన్నారు. ఉద్యోగులకు పదోన్నతులు లేవని, బదిలీలు లేవని, అంతర జిల్లాల బదిలీలు లేవన్నారు. అంతర జిల్లాల బదిలీల కోసం 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం 182 జీవోను ఇస్తే, ఈ ఆరేళ్లలో ఒక్కసారి కూడా అమలు చేయలేదన్నారు. ముఖ్యంగా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్ వైద్యం అందడం లేదన్నారు. కారణమేంటని ఆసుపత్రుల యాజమాన్యాలను అడిగితే, ప్రభుత్వం రూ.1,200 కోట్ల బకాయిలు ఉందని, వాటిని చెల్లిస్తేనే వైద్యం అంటూ బయటకు పంపిస్తున్నారన్నారు. అలాగే మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు క్వాంటమ్ ఆఫ్ ఇన్సింటివ్ ఇవ్వాలన్నారు. ఇవన్నీ కూడా కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఉపాధ్యాయ, ఉద్యోగులు పడుతున్న కష్టాలు, ఒకవైపు లక్షల కోట్లు అప్పులు, మరోవైపు ఆర్థికంగా బలోపేతం అంటూ మాటలు చెబుతున్నారని ఆయన కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వెంటనే పీఆర్‌సీని అమలు చేసి ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్లను ఆదుకోవాలని ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.