తెలంగాణ

పీఆర్సీ సాధనకు ఐక్య ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యానికీ, ప్రభుత్వ నిర్లక్ష్యానికీ నిరసనగా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చింది. శనివారం నాడు టీపీటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్సీ, ఎస్టీ టీయూ అధ్యక్షుడు జాడి రాజన్న అధ్యక్షత వహించారు. ఐఆర్, పీఆర్సీలపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చి 20 నెలలు గడచినా అది ఇంకా అమలులోకి రాలేదని సమావేశం అభిప్రాయపడింది. 2018 జూలై ఒకటి నుండి అమలు జరగాల్సిన వేతన సవరణ కోసం మూడు నెలల్లో ఇవ్వాల్సిన పీఆర్సీ నివేదిక గడులవు ముప్పై నెలలకు పెంచడం అంటే ఉద్యోగులను వంచించడమేనని సమావేశం అభిప్రాయపడింది. ఐక్య ఉద్యమం ద్వారా హక్కుల సాధనకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ఐక్యతకు జాక్టో తో కలిసి కృషి చేయాలని యూయస్సీసీ నిర్ణయించింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, అంతర్‌జిల్లా బదిలీలపై విద్యామంత్రి ఇచ్చిన హామీ కూడా నాలుగు నెలలైనా కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఐదేళ్లుగా పదోన్నతులు లేక అర్హతలున్న ఉపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. తక్షణమే పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించి వేసవి సెలవుల్లో పదోన్నతులు, అంతర్‌జిల్లా బదిలీలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులకు అనుగుణంగా సెప్టెంబర్ 2004కు ముందే ఎంపికై తనందతర కాలంలో ఉద్యోగాల్లో నియామకం అయిన ఉదపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపచేయాలని వారు కోరారు. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను సక్రమంగా అమలుచేయాలని వారు కోరారు. సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు కే జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు, డీటీఎఫ్ ప్రధానకార్యదర్శి టీ లింగారెడ్డి, ఎస్టీఎఫ్ అధ్యక్షుడు యు పోచయ్య, బీటీఎఫ్ అధ్యక్షుడు కొమ్ము రమేష్, ప్రధాన కార్యదర్శి ఎన్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.