తెలంగాణ

తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: హైదరాబాద్ పోలీసింగ్ వ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని, అత ఆరు సంవత్సరాలలో నక్సలిజం, టెర్రరిజం కదలికలు లేవని పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. శనివారం బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, ఇప్పటి వరకు ఒక్క సంఘటన కూడా జరుగలేదని, హైదరాబాద్ పోలీసు పనితీరును గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు అవార్డులు సైతం ప్రకటిస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగలేదని, ఆధారాలు లేకుండా పోలీసులపై కథనాలు రాస్తున్నారని విమర్శించారు. మీడియాలో కథనాలు ప్రజలకు నమ్మకం కలిగేలా ఉండలన్నారు. నిరాధారమైన వార్తలు రాస్తే సహించేదిలేదని అంజనీ కుమార్ హెచ్చరించారు. దేశంలోనే ఉత్తమ పోలిసింగ్‌గా నిలిచామని, బదిలీలు, పదోన్నతులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని సీపీ పెర్కొన్నారు. అసత్య కథనాలు రాయడం సరికాదన్నారు. దేశ వ్యాప్తంగా పోలీస్ శాఖకు మంచిపేరు ఉందని తెలిపారు. నేర పరిశోధనలో ఇతర రాష్ట్రాలకు సహాయం చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో ప్రభుత్వం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. పోలీస్ శాఖలో ఒకరిద్దరు తప్పుచేస్తే అందరిని అదే దృష్టితో చూడటం సమాంజసం కాదన్నారు. తప్పుడు కథనాలపై చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వార్తలు వచ్చాయని, అలాంటి అక్రమాలపై ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. సమాజంలో మీడియా పోషించాల్సిన బాధ్యత చాలా గొప్పదన్నారు. ప్రజలు మీడియాపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి అంశాన్ని మీడియాకు వివరిస్తున్నామని, ప్రజల్లో సరైన అవగాహన పెంచాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుందన్నారు. అసత్య వార్తలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని మీడియాకు సీపీ సూచించారు. నగరంలో జరిగే సభలకు అనుమతి విషయంలో పారదర్శకత పాటిస్తున్నామన్నారు. ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, ఇతరత్రా విభాగాలతో
చర్చించిన తర్వాతే సభలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని వివరించారు. తెలంగాణ ఎన్నికల విధుల్లో రాజకీయ జోక్యం జరుగలేదని, ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అవార్డు కూడా వచ్చినట్లు సీపీ గుర్తు చేశారు. శాంతి భద్రతలు, షీ టీమ్స్, సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. ఈ సమావేశంలో నగర శాంతి భద్రల అదనపు సీపీ డీఎస్.చౌహాన్, జాయింట్ సీపీలు తరుణ్ జోషి, పీ.అవినాష్ మహంతి, పీ.విశ్వప్రసాద్‌లు పాల్గొన్నారు.
*చిత్రం...మీడియా సమావేశంలో మాట్లాడుతున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్