తెలంగాణ

రిజర్వేషన్ల జోలికి వస్తే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: రిజర్వేషన్ల జోలికి వస్తే ఊరుకోమని, ఉద్యమాన్ని చేపడుతామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఇక్కడ రిజర్వేషన్ల పరిరక్షణపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక రాజకీయ , ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్లను విస్తరించాలన్నారు. ఇందుకు తగిన కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఈ అంశంపై రాష్ట్ర స్థాయి చర్చతో శ్రీకారం చుట్టామని, త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటనలు చేపడుతామన్నారు. ఈ చర్చలు జరిపి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఆర్థిక, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు చేపట్టే విధంగా కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుతీర్పుకు సవరణ చేపట్టే విధంగా బీసీ జన గణన చేపట్టే విధంగగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు.
అగ్రకులాలు, కుట్రలు మానుకోవాలని ఆయన అన్నారు. బీజసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలన్నారు. న్యాయస్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అన్ని తీర్పుల్లో రాజ్యాంగ బద్ధమైన తీర్పు ఇవ్వడంలేదన్నారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ బీసీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కుసుమ కుమార్ మాట్లాడుతూ మనువాదాన్ని భుజానికి ఎత్తుకున్న బీజేపీ రిజర్వేషన్లను అంతం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఉద్యమాల ఫలితంగానే బీసీలు, హాస్టల్ తదితర వసతుల ద్వారా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ రాములు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తే ప్రజల్లో తీవ్ర అశాంతి నెలకొంటుందన్నారు. మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పుకు నిరసనగా అసెంబ్లీ, పార్లమెంటులను ముట్టడి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఓబీసీ ఐక్యవేదిక అధ్యక్షులు అల్లంపల్లి రామ్ కోటి, నీలం వెంకటేష్, దాసు సురేష్, నాగుల శ్రీనివాస్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.