తెలంగాణ

నీరసిస్తున్న రైతు సమన్వయ సమితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: మహోన్నత ఆశయంతో ఏర్పాటైన రైతు సమన్వయ సమితులు వివిధ కారణాల వల్ల నీరసించిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రైతు సమన్వయ సమితులు (ఆర్‌ఎస్‌ఎస్) ఏర్పాటు చేశారు. రాష్టస్థ్రాయిలో హల్‌చల్ జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో చడీచప్పుడు లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌లకు నిధులు లేకపోవడం తదితర కారణాల వల్ల ఇవి నీరసించిపోతున్నాయి. రైతుబంధు అమలు చేయడం, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ, రైతు బీమా అమలు చేయడం, పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లభించే విధంగా చూడటం తదితర పనులను ఆర్‌ఎస్‌ఎస్‌లకు అప్పచెప్పాలని భావించారు. సాంకేతికంగా ఇది సాధ్యం కావడం లేదు. రైతుబంధు ఎవరి ప్రమేయం లేకుండానే రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. రైతుబీమా విషయంలో అధికారులు పూర్తి వివరాలను ఎల్‌ఐసీకి పంపించగానే బీమా సొమ్ము చెల్లించి వేస్తున్నారు. పట్టాదార్ పాస్‌పుస్తకాలకు సంబంధించి రెవెన్యూ అధికారుల నుండే రైతులు నేరుగా తీసుకుంటున్నారు. ఇక పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఇప్పించడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ల ప్రమేయం ఏమీ లేకపోవడం గమనార్హ. వరిధాన్యాన్ని సివిల్ సప్లై శాఖ, పత్తిని కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర పంటల ఉత్పత్తులను మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ తదితర సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. రైతులకు అవసరమైన విత్తనాలు సరఫరా చేయడంలో కూడా సమన్వయ సమితిల పాత్ర ఏమీ ఉండటం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసేందుకు గ్రామాలకు వెళ్లినప్పుడు మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌లను సంప్రదిస్తున్నారు.
2018 లో ఆర్‌ఎస్‌ఎస్‌లు ఏర్పాటయ్యాక వ్యవసాయ రంగంలో ఈ సంస్థపాత్ర ప్రముఖంగా ఉంటుందని భావించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి, కమిషనర్లు ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర కమిటీ పరిధిలో పనిచేయాల్సి ఉంటుందనుకున్నారు. జిల్లా కమిటీలు జిల్లా కలెక్టర్ల సమన్వయంతో పనిచేస్తాయని, అలాగే కింది స్థాయి కమిటీలు కూడా బలంగా ఉంటాయని భావించారు. ఆర్‌ఎస్‌స్ మండలస్థాయి, జిల్లా స్థాయి, రాష్టస్థ్రాయి సమావేశాలు ఏర్పాటు చేసేందుకు కూడా నిధులు లేకపోవడంతో ఇవి నీరసించిపోయాయి. మొత్తంమీద వ్యవసాయ రంగంలో రైతు సమన్వయ సమితిల ‘ఎఫెక్ట్’ ఏమీ లేదని తేలిపోయింది.