తెలంగాణ

మోసగించే కుట్రలను ఎండగడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ (ఖైరతాబాద్), ఫిబ్రవరి 23: ఎన్నికలు సమీపిస్తున్న వేళ మారో మారు ప్రజలను మోసగించేందుకు యత్నిస్తున్న అధికార టీఆర్‌ఎస్ కుట్రలను ఎండగట్టేందుకు పట్టణం గోస కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఎర్రవల్లికి సర్పంచ్‌లా లేదంటే చింతమడకకు ఎంపీటీసీలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కి ప్రజల బాధలు పట్టవని, ఏ పనిచేసిన వ్యక్తిగత, రాజకీయ లబ్ధిదాగి ఉంటుందని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా ఆ కుట్రలో భాగమేనని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఆశ చూపి ఎన్నికల్లో గెలుస్తూ పేద, మధ్య తరగతి ప్రజలను దారుణంగా మోసగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రోగాలకు సర్వరోగ నివారణి జిందా తిలిస్మాత్‌లా డబుల్ ఇళ్ల పథకాన్ని వాడుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిర్వహించిన సమగ్ర సర్వేలో 26లక్షల 31వేల మంది ఇళ్లు లేని నిరుపేదలు ఉన్నట్టు గుర్తించారని అన్నారు. కేవలం మహానగర పరిధిలోనే 10లక్షల వరకు ఈ సంఖ్య ఉంటుందని అన్నారు. ప్రభుత్వ అసమర్థతతో 20 జిల్లాలో ఇప్పటికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదని, ఇక హైదరాబాద్‌లో కేవలం 128 మాత్రమే పూర్తి చేసినట్టు శాసన మండలిలో ప్రభుత్వమే సమాదానం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అసెంబ్లీ సాక్షిగా డబుల్ ఇళ్లను ఇవ్వకపోతే 2018-19 ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పి నిస్సిగ్గుగా అదే పథకం పేరు చెప్పి తిరిగి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. సకాలంలో ఇళ్ల పూర్తికాకపోవడంతో స్థలాలు ఇచ్చినవారు నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు. ఒక్కొక్కరూ సుమారు నెలకు రూ.5వేలు అద్దెలు చెల్లిస్తున్నా కేసీఆర్ పూటకో మాట గంటకో ప్రకటన చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే పట్టణం గోస పేరుతో కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, కంటోనె్మంట్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తామని తెలిపారు. పట్టణ ప్రగతి పేరుతో వచ్చే గుంట నక్కలను సమస్యలపై నిలదీయాలని ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని చెప్పారు. దీంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుకొని పార్లమెంట్‌లో చర్చించనున్నట్టు తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేయాలని కేంద్రాన్ని సైతం కోరనున్నట్టు చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శ్రీ్ధర్, నర్సింహా రెడ్డి, కూనా శ్రీశైలం గౌడ్, పద్మారావు పాల్గొన్నారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ రేవంత్ రెడ్డి