తెలంగాణ

నిండుకుండలా సరస్వతీ బ్యారేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, ఫిబ్రవరి 23: జయశంకర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సరస్వతీ బ్యారేజీ (అన్నారం) నిండుకుండను తలపిస్తోంది. 119 మీటర్ లెవల్‌లో ఉండగా 10.87 పూర్తి సామర్ధ్యానికి ప్రస్తుతం 10.17 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బ్యారేజీలోకి ఇన్‌ఫ్లో 22వేల క్యూసెక్కుల నీరు రాగా ఔట్ ఫ్లో 18వేల క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజీ)లో 16.17 టీఎంసీల నీటి నిల్వకు ప్రస్తుతం 9.635 టీఎంసీల నీటి నిల్వ ఉందని ఇఇ రమణారెడ్డి తెలిపారు. బ్యారేజీలోకి ఇన్‌ఫ్లో 2 వేల క్యూసెక్కులు రాగా ఔట్ ఫ్లో 23,100 ఉందని అధికారులు తెలిపారు. లక్ష్మీ పంపుహౌస్ 11 మోటార్ల నుంచి సరస్వతీ బ్యారేజీ నుంచి నీటిని తరలిస్తున్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థుల సందర్శన
జిల్లాలోని మహదేవ్‌పూర్ మండలంలో నిర్మించిన సరస్వతీ బ్యారేజీని మేడ్చల్ జిల్లా గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆదివారం సందర్శించారు. బ్యారేజీ ఏఈఈ యాకయ్య వారికి ప్రాజెక్టు గురించి వివరించారు. ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు పలువురు సందర్శించిన వారిలో ఉన్నారు.
*చిత్రం...నిండుకుండలా కనిపిస్తున్న సరస్వతీ బ్యారేజీ