తెలంగాణ

సైబర్ దాడులను ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: సైబర్ దాడులను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి చెప్పారు. సీడీటీఐ క్యాంపస్‌లో నేషనల్ సైబర్ రీసెర్చి ఇన్నోవేషన్ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్‌ను సోమవారం నాడు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సైబ ర్ దాడులను, బెదిరింపులను ఎదుర్కోవడానికి తనను తాను సిద్ధం చేసుకోవడంలో జాతీయ సైబర్ రీసెర్చి ఇన్నోవేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కింద ఉన్న ఏడు ప్రధాన కేంద్రాల్లో సీడీటీఐ ఒకటని ఆయన అన్నారు. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో నిరంతర పరిశోధనలు, ఆవిష్కరణల అవసరం ఎంతో ఉందని ఆయన చెప్పారు. ఈ కీలకమైన ప్రాజెక్టును చేపట్టినందుకు బ్యూ రో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్‌ను ఆయన అభినందించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తరణతో
జీవితం చాలా తేలికైందని, కానీ సాంకేతిక పరిజ్ఞానం అనేది రెండు వైపులా పదును ఉన్న ఆయుధమని ఆయన అన్నారు. నేరస్థులు దీనిని ఇతర ప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో గత దశాబ్దంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయని, సైబర్ బెదిరింపులతో పోరాడడం సవాల్‌గా మారుతోందని ఆయన అన్నారు. డిజిటలైజేషన్, సాంకేతిక పరిజ్ఞానంపై మనం ఎక్కువగా ఆధారపడడం వల్ల సైబర్ స్పేస్ కోసం డిమాండ్ ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి భారతీయుడు ఒకవిధంగా లేదా మరోవిధంగా సైబర్ స్పేస్‌ను ఉపయోగిస్తున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. ఎక్కువ శాతం మంది ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని, తద్వారా పరస్పరం సమాచారాన్ని పంచుకుంటున్నారని ఆయన అన్నారు. సంబంధిత కంపెనీలు అనుసరించే భద్రత ప్రొటోకాల్ గురించి ఎవరికీ తెలియదని, అయినా ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేస్తుంటామని మంత్రి చెప్పారు. అంతా స్మార్టు ఫోన్‌లను వాడుతుంటామని, వాటిని సరైన మార్గంలో ఉపయోగించే పద్ధతులను చాలా సమయాల్లో పాటించడం లేదని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా నేరస్థులు మన ఫోన్, ఇతర డేటాను యాక్సస్ చేయవచ్చని, టెక్నాలజీ మన జీవితాలను సుఖమయం చేస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా టెక్నాలజీ కొన్ని సందర్భాల్లో మన జీవితాలను దుర్భరం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సైబర్ సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని, నేరస్థులు, ముఖ్యంగా సాంకేతిక అవగాహన ఉన్న నేరస్థులు దానిని వారి ప్రయోజనాలకు ఉపయోగిస్తారని అన్నారు. పరిశోధనలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించే అంకితభావాన్ని మంత్రి అభినందించారు. సైబర్ నేరాలకు పాల్పడే వారి వివరాలను ముందస్తుగా ఖరారు చేయడానికి, ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి హోం శాఖ ఇలాంటి కేంద్రాలను దేశవ్యాప్తంగా ప్రారంభించిందని ఆయన అన్నారు. సైబర్ నేరాలు జరగడానికి ముందే వాటిని నిరోధించడమే తమ లక్ష్యమని చెప్పారు. సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ, ఐఐటీ వంటి సంస్థలు, ప్రభుత్వ రంగంలో డీఆర్‌డీఓ, ప్రైవేటు రంగంలో అనేక ఐటీ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ఐదు యంగ్ సైంటిస్ట్సు ల్యాబ్‌లను ప్రారంభించారని, ఈ కేంద్రాల్లో 35 ఏళ్లలోపు వారికే ప్రాధాన్యత ఉంటుందని మంత్రి అన్నారు. యువ శాస్తవ్రేత్తలను ప్రోత్సహించడమే తమ ఉద్దేశ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజీ కౌముది, ఐజీ డీ కరుణసాగర్, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ పాల్గొన్నారు.

*చిత్రం...హైదరాబాద్‌లోని సీడీటీఐ క్యాంపస్‌లో నేషనల్ సైబర్ రీసెర్చి ఇన్నోవేషన్ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్‌ను సోమవారం నాడు ప్రారంభిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి