తెలంగాణ

ఉత్సాహభరితంగా ‘పట్టణ ప్రగతి’ షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం సోమవారం రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలలో ప్రారంభమైంది. 140 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లలో ప్రారంభించిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల మేయర్లు, చైర్‌పర్సన్లు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పండగల సందర్భంగా జరిగే హడావుడి ఈ సందర్భంగా పట్టణాల్లో కనిపించింది. మున్సిపల్ వ్యవహారాల మంత్రి కేటీఆర్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మహబూబ్‌నగర్‌లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వనపర్తిలో వ్యవసాయ మంత్రి ఎస్. నిరంజన్‌రెడ్డి, కరీంనగర్ జిల్లాలో ఈటల రాజేందర్, సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఇతర జిల్లాల్లో సంబంధిత మంత్రులు పాల్గొన్నారు. పల్లెప్రగతి విజయవంతం అయినట్టే పట్టణ ప్రగతి కూడా విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అత్యంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు గత రెండురోజుల నుండి మున్సిపల్ కార్పోరేషన్ల మేయర్లు, చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, సోమవారం పట్టణ ప్రగతి ఘనంగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. పట్టణ ప్రగతిలో ప్రధానంగా సానిటేషన్‌పై శ్రద్ద తీసుకుంటున్నారు. రోడ్లు, ఇళ్లు వాకిళ్లకు దగ్గర్లో చెత్త లేకుండా చూడటం, మురుగునీరు నిలువ ఉండకుండా వెళ్లిపోయేలా చూడటం, పట్టణాలకు దూరంగా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశారు. రోడ్లు శుభ్రంగా ఉండేలా చూస్తున్నారు. హరితహారంలో బాగంగా మొక్కలు నాటుతున్నప్పటికీ, వచ్చే మూడు, నాలుగు నెలల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అందువల్ల వీటిని రక్షించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టంప్రకారం నాటిన మొక్కల్లో 85 శాతం వరకు జీవించాలని, ఎక్కడైనా మొక్కలు 15 శాతం కన్నా చనిపోతే తీవ్ర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది. కొత్తగా ఎన్నికైన మేయర్లు, కార్పోరేటర్లు, చైర్‌పర్సన్లు, వార్డు కౌన్సిలర్లు అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు.