తెలంగాణ

ఆర్టీసీని లాభాల వైపు నడిపేందుకు ఈడీల డిపోల సందర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: ఆర్టీసీని లాభాల వైపు నడిపించడానికి సంస్థ ఉన్నతాధికారులు పర్యటనలు చేపట్టారు. నేరుగా ఉన్నతాధికారులే డిపోల సందర్శనలు చేపట్టడంతో సంబంధిత డిపో మేనేజర్లు అలర్ట్ అయ్యారు. తమ పరిధిలో ఉద్యోగ, కార్మికులకు సంబంధించిన సమస్యలు ఎక్కడ పై అధికారుల దృష్టికి తీసుకుపోతారోనని డిపో మేనేజర్లు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ సమ్మె ముగిసిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ డిపోల వారిగా వెల్పేర్ కమిటీలు ఏర్పాటుకు ఆదేశించారు. కార్మికులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి డిపోల కమిటీలే పర్యవేక్షిస్తాయని సంస్థ చెబుతోంది. అయినా సమస్యలు పరిష్కరించకుండా ఉద్యోగ, కార్మికులపై డిపో మేనేజర్లు వేధింపులకు గురి చేస్తున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డిపోలను దత్తత తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. జహీరాబాద్ డిపోను సోమవారం సంస్థ ఈడీ వేంకటేశ్వరావు సందర్శించారు. ఇటీవల మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, మహాశివరాత్రి పండుగ, ఝరాసంఘం, ఏడుపాయలకు ప్రత్యేక బస్సులు నడపడంతో ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. భవిష్యత్‌లో కూడా ఆర్టీసీని లాభాల వైపు నడపడానికి డిపోల వారిగా ఆదాయాన్ని పెంచడానికి ఉద్యోగ, కార్మికులు కలసి పని చేయాలని ఆయన సూచించారు.