తెలంగాణ

కృష్ణ కిషోర్ సస్పెన్షన్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మండలి సీఈఓగా పనిచేసిన ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను
కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) రద్దు చేసింది. ఆయన మళ్లీ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. కృష్ణకిశోర్‌పై ఏమైనా కేసులు ఉంటే వాటిని చట్టప్రకారం కొనసాగించవచ్చని క్యాట్ పేర్కొంది. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈఓగా కృష్ణకిశోర్ పనిచేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమలు, వౌలిక వసతుల శాఖ నుండి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం కృష్ణకిశోర్ హయాంలో జరిగిన అక్రమాలపై కేసులు నమోదు చేసి విచారణ జరపాలని సీఐడీ, అవినీతి నిరోధక శాఖల డీజీలను ఆదేశించింది. కృష్ణకిశోర్ ఈడీబీ సీఈఓగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం సహా ప్రభుత్వ అనుమతి లేకుండా కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారనే అభియోగాలపై కేసు నమోదైంది. కృష్ణకిశోర్ నేరపూరిత నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని, ఏపీ ఆర్థిక మండలి చట్టాన్ని ఉల్లంఘించారని పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని, విచారణ పూర్తయ్యే వరకూ కృష్ణకిశోర్ అమరావతి విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలావుండగా, రాష్ట్ర ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కృష్ణకిశోర్ క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్ తుది తీర్పును మంగళవారం నాడు వెలువరించింది.