తెలంగాణ

హింసకు బాధ్యులపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఢిల్లీలో హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న వారి వెనుక ఎవరున్నా అందుకు బాధ్యులపై చర్యలు తప్పవని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఢిల్లీ ఘటన ప్రభుత్వ వైఫల్యం కాదని, ఢిల్లీ పూర్తిగా పోలీసుల అదుపులోనే ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అండ సుకుని అసదుద్దీన్ ఒవైసీ రెచ్చిపోతున్నారని, పులి మీద కేసీఆర్ స్వారీ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. లక్ష మంది అసదుద్దీన్‌లు అడ్డుపడినా సీఏఏను అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో దేశంలోని పౌరులెవరికీ నష్టం లేదని, కావాలనే దీనిపై రాజకీయ పార్టీ లు విష ప్రచారం చేస్తున్నాయని ఆయన మం డిపడ్డారు. ఆయా పార్టీలు
లేని అంశాలను జోడించి మతపరమైన విద్వేషాలు సృష్టిస్తున్నాయని, దేశంలో పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. సీఏఏతో ఏ ఒక్కరికీ నష్టం లేదని, పాకిస్తాన్, బంగ్లాదేశ్ పంపిస్తారంటూ దిగజారుడు ప్రచారానికి రాజకీయ పార్టీలు దిగుతున్నాయని, కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. సీఏఏతో దేశంలోని 130 కోట్ల మంది భారతీయుల్లో ఏ ఒక్కరికీ నష్టం కలగదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా ఈ చట్టానికి వ్యతిరేకం కాదని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ ప్రజలు తప్పుడు ప్రచారం నమ్మవద్దని ఆయన హితవు పలికారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే దేశ ప్రతిష్టను పెంచడానికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఆర్థిక శక్తిలో భారతదేశం అగ్ర భాగాన ఉండాలన్న సదుద్దేశ్యంతోనే మోదీ కష్టపడుతున్నారని తెలిపారు. ప్రధాని విజయాలను జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
పాకిస్తాన్‌ను ఏకాకిని చేయాలని భారత్ అమెరికాతో జతకట్టిందని మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ట్రంప్ భారత పర్యటనలో ఉండగా ఢిల్లీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఒక చేతితో జాతీయ జెండా పట్టుకుని మరో చేత్తో రాళ్ల దాడి చేస్తున్నారని, ఇందులో కుట్ర ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరు హింసకు పాల్పడినా సహించేది లేదని, సంఘవిద్రోహ శక్తులపై కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. రెండు నెలలుగా ఉద్యమాలు చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం సంయమనం పాటిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రశాంతమైన వాతావరణం దెబ్బతీసే విధంగా వ్యవహరించవద్దని, రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని మంత్రి సూచించారు.

*చిత్రం... హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి