తెలంగాణ

వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే సంజీవ రావు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఫిబ్రవరి 25: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బీ సంజీవ రావు మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఈయనకు సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా మంగళవారం ఉదయం మృతి చెందారు. రంగారెడ్డి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బీ.సంజీవ రావు రాజకీయాల్లో రాక ముందు కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. వ్యవసాయ అధికారిగా, ఎంపీడీఓగా పని చేశారు. ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరారు. వికారాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా, ధారూరు జడ్పీటీసీగా, వికారాబాద్ ఎమ్మెల్యేగా పలు పదవులు నిర్వహించారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి టిక్కెట్టు లభించకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సోమవారం రాత్రి ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించగా మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మృతిచెందారు. సంజీవరావు మృతిపట్ల విద్యాశాఖ మంత్రి పీ.సబితా రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ పీ.సునీతా రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ సంతాపం
వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో తీవ్ర దిగ్బ్రంతి వ్యక్తం చేశారు. సంజీవరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

* వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బీ.సంజీవ రావు (ఫైల్‌ఫొటో )