తెలంగాణ

రాహుల్‌కే ఏఐసీసీ పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని మళ్లీ ఏఐసీసీ అధ్యక్ష పదవిలో నియమించాలని తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన నేతలు పార్టీ హైకమాండ్‌ను కోరారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, ఎస్ చంద్రశేఖర్, ఎం కోదండరెడ్డి, డాక్టర్ పీ వినయ్ కుమార్, జీ నిరంజన్, ఏ శ్యాంమోహన్, బీ కమాలకరరావు, ఎస్ చంద్రశేఖర్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని రక్షించే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజలు భావిస్తున్నారన్నారు. దేశంలో మతతత్వశక్తులు, విభజన శక్తులు రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే దేశం ప్రగతిని సాధించిందన్నారు. ప్రతి పక్ష పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తోందన్నారు. 1977, 1989, 1991 నుంచి 2004 మధ్య కాంగ్రెస్ పార్టీ ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందన్నారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చి, పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలన్నారు. వీలైనంత త్వరలో పార్టీ సదస్సును నిర్వహించాలని వారు కోరారు. రాహుల్ గాంధీకి మళ్లీ పార్టీ పగ్గాలు అందించాలన్నారు. పార్టీకి ప్రజల్లో చెక్కుచెదరని క్యాడర్ ఉందని వారు తెలిపారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితికి బీజేపీ కారణమని, ప్రజలు ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వారు పేర్కొన్నారు. దేశం కోసం, లౌకిక శక్తులను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని వారు చెప్పారు.