తెలంగాణ

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, ఫిబ్రవరి 25: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని గఢా అధికారి ముత్యంరెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని వెంకటాపూర్(బీజీ), మాందాపూర్‌లో గడపగడపకు గఢా కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో పర్యటించారు. ఈసందర్భంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు వాటి సద్వినియోగంపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను అధికారులు స్వీకరించారు. ముఖ్యంగా పించన్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, రైతు బంధు, రైతు రుణమాఫీ తదితర అంశాలపై రైతులు గఢా దృష్టికి తెగా, సమస్యలన్నిటినీ త్వరలోనే పరిష్కరిస్తామనమి ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల విజ్ఞప్తులపై సంబంధిత అధికారులు వారి శాఖల వారిగా సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవిన్యూ శాఖకు సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నందున తహసీల్దార్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అదేశించారు. పల్లెప్రగతిపై ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు. హరితహారం ద్వారా నాటిన చెట్లను సంరక్షించాలని చెప్పారు. నాటిన ప్రతి మొక్కను ఎండిపోకుండా చూసే భాద్యత స్థానిక కార్యదర్శులదే అన్నారు. అనంతరం గ్రామస్థులతో కలిసి చెట్లను నాటారు. జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు గుండారంగారెడ్డి, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు యాదవరెడ్డి, నాయకులు కరుణాకర్, యాదగిరి, సర్పంచ్‌లు మంజుల, బిక్షపతి, అయా శాఖల అధికారులు పాల్గొన్నారు.