తెలంగాణ

కంది రైతుల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోత్కూర్, ఫిబ్రవరి 25: మోత్కూర్ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో మంగళవారం రెండో రోజు కూడా కందుల కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఆందోళన వ్యక్తం చేస్తూ భువనగిరి మెయిన్ రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. పట్టణ ప్రగతిలో పాల్గొని వెళ్తున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. తహశీల్దార్ అహ్మద్ రైతులకు సద్ది చెప్పినప్పటికీ వినకుండా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ వాహనాన్ని చుట్టుముట్టారు. దీంతో వాహనం దిగిన కీమ్యా నాయక్‌ను చుట్టుముట్టి మార్కెట్ యార్డ్‌ను సందర్శించాలని పట్టుబట్టారు. గత పది రోజుల నుండి మార్కెట్‌లోకి తెచ్చిన కందులను కొనుగోలు చేయడం లేదని, సింగిల్ విండో అధికారులు, నిర్వాహకులు అలసత్వం వహిస్తున్నారని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోయారు. మార్కెట్‌లో పెద్ద ఎత్తున కందుల రాసులు పేరుకొని పోయాయని, కొనుగోళ్లు, తేమ పరీక్షలు నిర్వహించడం లేదని, గన్నీ సంచుల కొరత ఉందని రైతులు కలెక్టర్‌కు విన్నవించారు.