తెలంగాణ

కంది రైతులకు ప్రభుత్వ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్రంలో కంది పంట వేసిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మార్కెట్లో కందుల ధరలు తగ్గాయని, కనీస మద్దతు ధర లభించడం లేదంటూ రైతులు ఆందోళన చేస్తుండటంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. రైతులనుండి కందులను సేకరించేందుకు ఇప్పటికే మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎన్‌సీడీసీ నుండి మార్క్‌ఫెడ్‌కు ఈ ఏడాది మంజూరైన 1500 కోట్ల రూపాయల నుండి 381 కోట్ల రూపాయలు కందుల కొనుగోలుకు ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి పేరుతో మంగళవారం జీఓ (ఆర్‌టీ నెంబర్ 109) జారీ అయింది. రైతుల నుండి 56 వేల టన్నుల కందులను కొనుగోలు చేయాలని ఈ ఉత్తర్వుల్లో ఆదేశించారు. కందుల సేకరణ తర్వాత తిరిగి ఈ స్టాకును మార్క్‌ఫెడ్ బహిరంగ మార్కెట్లో విక్రయించిన తర్వాత నష్టం ఏమైనా వస్తే, ఈ మేరకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని జీఓలో పేర్కొన్నారు. రైతులనుండి కందులను నేరుగా కొనుగోలు చేయాలని, మధ్యదళారుల ప్రమేయం ఉండకుండా చూడాలని మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు.