తెలంగాణ

పర్యావరణ అభివృద్ధికి ఐఐటీ, ఐఐఎంల కన్సార్టియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: దేశంలో ఐఐటీలు, ఐఐఎంలూ కలిసి పర్యావరణ వ్యవస్థ వృద్ధికి బృహత్తర కాన్సార్టియంను ఏర్పాటు చేశాయి. ఇన్నోవేషన్ వెంచరింగ్ అండ్ ఎంటర్‌ప్రిన్యూయర్ షిప్ ఇన్ ఇండియా నెట్‌వర్కు -ఐవీన్ పేరిట ఈ కాన్సార్టియంను ప్రారంభించాయి. పరిశోధనలను ప్రోత్సహించడం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత చుట్టూ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యాలుగా ఈ నెట్ వర్కు పనిచేస్తుంది. దీంట్లో చెన్నై ఐఐటీ, ముంబై ఐఐటీ, బెంగలూరు ఐఐఎం, కొల్‌కటా ఐఐఎం, కోజికోడ్ ఐఐఎంలకు చెందిన ఫ్యాకల్టీ సభ్యులు ఉంటారు. నెట్ వర్కు కార్యకలాపాలను చెన్నై ఐఐటీ ప్రొఫెసర్ ఏ థిళ్లై రాజన్ మాట్లాడుతూ ఆవిష్కరణ, వెంచరింగ్, వ్యవస్థాపకత అనే అంశాలపై ఇటీవలి కాలంలో విధాన నిర్ణేతలు అమితమైన శ్రద్ధ చూపుతున్నారని, ఆవిష్కరణల దేశంగా భారతదేశపు స్థానాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఆర్ధికాభివృద్ధిలో ఈ మూడు అంశాలు అత్యంత కీలక పాత్రను పోషించనున్నాయని అన్నారు. సదస్సులు , జర్నల్స్ ప్రచురణ ద్వారా సంబంధిత జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి నెట్‌వర్కు పనిచేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో ఐఐటీలు, ఐఐఎంలు చురుకైన పాత్రను పోషించనున్నాయని అన్నారు.